Petrol Diesel Price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరగనున్నాయా..? తాజాగా ఇంధన ధరల వివరాలు..!

|

May 18, 2022 | 8:18 AM

Petrol Diesel Price: పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు పడుతున్నాయి. దీంతో వాహనదారులకు కొంత ఊరట కలుగుతోంది. చివరి సారిగా ఏప్రిల్‌ 6వ తేదీన పెరిగిన ..

Petrol Diesel Price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరగనున్నాయా..? తాజాగా ఇంధన ధరల వివరాలు..!
Follow us on

Petrol Diesel Price: పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు పడుతున్నాయి. దీంతో వాహనదారులకు కొంత ఊరట కలుగుతోంది. చివరి సారిగా ఏప్రిల్‌ 6వ తేదీన పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా మే 18న ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెరుగుతున్న ధరల విషయంపై ప్రభుత్వం అయోమయంలో పడింది. త్వరలోనే ప్రభుత్వం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. గత 42 రోజులుగా ధరలో ఎలాంటి మార్పు లేదు. చివరిసారిగా ఏప్రిల్ 6వ తేదీన పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు 80-80 పైసలు పెరిగింది.

ఈరోజు దేశ రాజధానిలో పెట్రోల్ ధర 105.41 ఉండగా, డీజిల్ ధర రూ.96.67గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ .120.51 ఉండగా, డీజిల్ ధర రూ.104.77గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్ ధర రూ. 115.12 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ. 99.83 ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.110.85, డీజిల్ ధర లీటరుకు రూ.100.94గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.119.49 ఉండగా, లీటర్‌ డీజిల్ ధర రూ.105.65కు చేరుకుంది.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో 95 డాలర్ల క్రూడాయిల్‌ ధరపై పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆధారపడి ఉన్నాయి. సోమవారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర 115 డాలర్ల వద్ద, డబ్ల్యూటీఐ క్రూడ్ బ్యారెల్ ధర 111 డాలర్ల వద్ద ముగిసింది. భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతి చేసుకుంటోంది. మిడిల్ ఈస్ట్, అమెరికా నుండి చాలా వరకు దిగుమతులు జరుగుతున్నాయి. రష్యా నుంచి 2 శాతం మాత్రమే దిగుమతి అవుతుంది. అయితే ప్రస్తుతం ధరలు నిలకడగా ఉన్నా.. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి