ఇంటి అద్దెలు ఇంతలా పెరగడానికి కుక్కలే కారణం! జోక్‌ కాదు.. మతిపోగొట్టే నిజం!

బెంగళూరులో పెంపుడు జంతువులపై ప్రేమ ఇప్పుడు ఖరీదైంది. ఇంటి యజమానులు అదనపు అద్దె (పెట్ రెంట్) వసూలు చేస్తున్నారు. పెంపుడు జంతువుల వల్ల కలిగే నష్టాలు, శుభ్రత ఖర్చుల కోసం ఇది అని చెబుతున్నారు. ఈ కొత్త ధోరణి బెంగళూరులోని రిచ్‌ ఏరియాల్లో మొదలై హైదరాబాద్‌కు కూడా విస్తరిస్తుందని నిపుణులు అంటున్నారు.

ఇంటి అద్దెలు ఇంతలా పెరగడానికి కుక్కలే కారణం! జోక్‌ కాదు.. మతిపోగొట్టే నిజం!
Pet Dogs

Updated on: Nov 26, 2025 | 8:00 AM

మన దేశానికి సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు.. పనికి, నైట్‌ లైఫ్‌కి, అలాగే పెంపుడు జంతువుల పట్ల అపారమైన ప్రేమకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కేఫ్‌లు పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక మెనూలను అందిస్తాయి. ప్రతి వీధి మూలలో లాబ్రడార్ లేదా బీగల్‌ను చూడవచ్చు. పెంపుడు జంతువుల పుట్టినరోజు పార్టీలు ఇక్కడ సర్వసాధారణం. కొంతమంది అయితే పెంపుడు జంతువులను ఇక్కడ కుటుంబ సభ్యులుగా చూస్తారు. కానీ ఈ ప్రేమ ఇప్పుడు జేబుపై భారం పడుతోంది. దాంతో పాటు పెట్స్ రెంట్ అనే కొత్త విధానం గురించి పుట్టుకొచ్చింది.

మీరు బెంగళూరులో అద్దె ఇంట్లో నివసిస్తుంటే, పెంపుడు జంతువును కలిగి ఉంటే, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంటి యజమానులు ఇప్పుడు అద్దె ఒప్పందాలకు కొత్త రూల్స్‌ పెడుతున్నారు. ఇంటి రెంట్‌పై అదనంగా రూ.1000 నుంచి రూ.2000 చెల్లించాల్సి వస్తుంది. పెంపుడు జంతువులైన కుక్కల్ని పెంచుకోవాలంటే ఈ ఎక్స్‌ట్రా రెంట్‌ కట్టాల్సిందే.

ఎందుకు ఎక్స్‌ట్రా రెంట్‌..?

ఈ పెట్‌ రెంట్‌ మొదట కోరమంగళ, HSR లేఅవుట్ వంటి రిచ్‌ ఏరియాల్లో ప్రారంభమైంది. పెంపుడు జంతువులు తమ ఇళ్లకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయని కొంతమంది ఇంటి యజమానులు ఇలా పెట్‌ రెంట్స్‌ అనే కాన్సెప్ట్‌ తీసుకొచ్చారు. నేలపై మరకలు, గోడలు లేదా తలుపులపై గీతలు, బొచ్చు, దుర్వాసనల కారణంగా క్లినింగ్‌ ఖర్చులు, మరిన్నింటిని కవర్ చేయడానికి ఈ అదనపు అద్దె వసూలు చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇందిరానగర్, బెల్లందూర్, వైట్‌ఫీల్డ్‌లకు వ్యాపించింది. మెల్లమెల్లగా ఈ పెట్‌ రెంట్‌ మన హైదరాబాద్‌లో వచ్చేస్తుందని నిపుణులు అంటున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us