Personal Loan: కరోనా కాలంలో వేటి కోసం ఎక్కువగా రుణాలు తీసుకున్నారో తెలుసా..?.. తాజా రిపోర్టు

|

Mar 25, 2021 | 2:48 PM

Personal Loan: కరోనా మహమ్మారి తర్వాత రుణాలు తీసుకునే వారి సంఖ్య ఎక్కువైపోయింది. కరోనాతో లాక్‌డౌన్‌ కారణంగా చాలా రంగాలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి...

Personal Loan: కరోనా కాలంలో వేటి కోసం ఎక్కువగా రుణాలు తీసుకున్నారో తెలుసా..?.. తాజా రిపోర్టు
Personal Loan
Follow us on

Personal Loan: కరోనా మహమ్మారి తర్వాత రుణాలు తీసుకునే వారి సంఖ్య ఎక్కువైపోయింది. కరోనాతో లాక్‌డౌన్‌ కారణంగా చాలా రంగాలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. అంతేకాదు సామాన్యుడి నుంచి వ్యాపారుల వరకు ఆర్థికంగా కుంగిపోయారు. ఈ నేపథ్యంలో రుణాలు తీసుకునే వారి సంఖ్య చాలా పెరిగిపోతోంది. ముఖ్యంగా వ్యక్తిత రుణాలు తీసుకునేవారి సంఖ్య పెరిగింది. సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు గత ఏడాది దేశ వ్యాప్తంగా 25 శాతం మంది వ్యక్తిగత రుణాలు తీసుకున్నట్లు ఇండియాలెండ్స్‌ రిపోర్టు తెలిపింది. 18శాతం మంది వైద్య ఖర్చుల నిమిత్తం తీసుకుంటే, 17 శాతం మంది ద్విచక్ర వాహనాలు, కార్ల కొనుగోలు కోసం రుణం తీసుకున్నట్లు తెలిపింది. కోవిడ్‌ కారణంగా ప్రజలపై సామాజిక, ఆర్థిక ప్రభావం అధికంగా పడటంతో రుణాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

ఏడాది కిందట లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి రుణగ్రహీతల మనోభావాలను ఆర్థం చేసుకోవడానికి ఈ కొత్త డిజిటల్‌ లెండింగ్‌ ప్లాట్‌ ఫాం రుణాలను అంచనా వేస్తోంది. 2020 మార్చి 25 నుంచి 2021 మార్చి 20వ తేదీ వరకు 20-55 ఏళ్ల మధ్య వయసున్న వారు 1,50,000 మంది తీసుకున్న రుణాల ఆధారంగా డేటా సేకరించి దేశ వ్యాప్త అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ జాబితాలో టైర్‌-1, టైర్‌ -2 నగరాలను సేకరించింది. ఢిల్లీ ప్రాంతం నుంచి అధికంగా రుణ దరఖాస్తులు రాగా, టైర్‌-2 నగరాల్లో 38 శాతం పెరుగుదల కనిపించింది. అయతే విలాసవంతమైన ఖర్చుల వల్ల టైర్‌-1 నగరాల నుంచి కూడా రుణ డిమాండ్‌ పెరిగింది.

ఇండియా లెండ్స్‌ నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు..

ముంబాయిలో 27 శాతం మంది సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు వ్యక్తిగత రుణాలను తీసుకున్నారు. 15 శాతం మంది ల్యాప్‌టాప్స్‌, టాబ్‌లెట్స్‌ లాంటి ఎలక్ట్రానిక్‌ ఉపకణాలను కొనుగోలు చేయడానికి రుణాలు తీసుకున్నారు. వర్క్‌ఫ్రం హోమ్‌ కల్చర్‌ కు మారడం వల్ల ఇవి పెరిగాయి. ఢిల్లీలో 13 శాతం మంది వాషింగ్‌ మెషిన్‌, డిష్‌వాషర్‌ లాంటి గృహోపకరణాల కొనుగోలు కోసం రుణాలకు దరఖాస్తులు చేసుకున్నారు. కరోనా కారణంగా 25 శాతం వైద్య ఖర్చుల కోసం రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే బెంగళూరులో 28శాతం ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, 12 శాతం అప్‌స్కిల్లింగ్‌ కోర్సుల కోసం రుణాలకు దఖాస్తు చేసుకున్నట్లు నివేదిక తేల్చింది.

చెన్నైలో 19శాతం మంది టూవీలర్లు, కార్లు కొనుగోలు కోసం రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 17 శాతం మంది స్మార్ట్‌ టీవీలు, ల్యాప్‌టాప్స్‌ లాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల కోసం రుణాలను ఎంచుకున్నారు. హైదరాబాద్‌లో 20 శాతం మంది రుణ గ్రహీతలు వారి వైద్య ఖర్చుల కోసం వ్యక్తిగత రుణాలను ఆశ్రయించారు. అయితే 15 శాతం మంది ఉన్నత స్థాయి కోర్సుల కోసం తీసుకున్నారు.

అయితే ఈ సర్వే ఫలితాలను గమనిస్తే వివాహ, ప్రయాణ ఖర్చులు కొంత శాతం తగ్గింది. ప్రస్తుతం యువత కూడా ఎక్కువగా వివాహాలకే మొగ్గు చూపుతున్నారు. దాదాపు 52 శాతం మంది రుణ గ్రహీతలు 25 నుంచి 35 ఏళ్ల మద్య వయసున్న వారే. ఈ రిపోర్టు ఆధారంగా మహిళలు, పురుషులు ఇద్దరూ 10 వేల నుంచి రూ.5 లక్షల లోపు రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి : Health Check-up Benefits: మార్చి 31లోపు ఇలా చేయండి.. రూ.50 వేల వరకు ప్రయోజనం పొందే అవకాశం..!

Holi Offer On Iphone: హోలీకి ఐఫోన్‌ పై బంపరాఫర్‌.. ఏకంగా రూ. 13 వేల ఆదా.. ఎక్ఛ్సేంజ్‌తో మరో రూ. 3 వేలు..