
ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏ వస్తువు కొనాలన్నా భారీ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇక భార్య, పిల్లలు ఉంటే మనకు వచ్చే జీతం అసలు సరిపోదు. ఇంటికి అవసరమయ్యే నిత్యావసరాలతో పాటు పిల్లల పోషణ, చదువులు, హాస్పిటల్ ఖర్చుల కోసం వేలకు వేలు ఖర్చు అవుతాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ఉద్యోగి అతి కష్టంపై బ్రతుకుబండిని నెట్టుకొస్తున్నాడు. మనకు వచ్చే జీతాన్ని ఏ నెలకు ఆ నెల ఖర్చు పెడితే భవిష్యత్తు అవసరాలకు కష్టమవుతుంది. అందుకే డబ్బలు పొదుపు చేసుకోవాల్సిన అవసరముంది. ఇంటి అవసరాలకు పొనూ డబ్బులు ఎలా పొదుపు చేసుకోవాలి.. దీనికి ఎలాంటి ఫార్ములా పాటించాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
డబ్బుల విషయంలో 50/30/20 అనే ఫార్ములా పాటించడం వల్ల డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. ఈ పద్దతి ప్రకారం మనకు వచ్చే జీతంలో 50 శాతం వరకు మన ఇంటి అవసరాల కోసం ఖర్చు చేయాలి. నిత్యావసర సరుకులు, కరెంట్ బిల్లు, పిల్లల ఫీజులు, ఈఎంఐ పేమెంట్స్, ఇతర బిల్లులు ఈ కేటగిరీలో ఉంటాయి. ఆ తర్వాత 30 శాతం డబ్బులను మీ సరదాలకు ఖర్చు పెట్టొట్టు. విందులు, టూర్లు, వినోదాలు వంటివి ఈ కేటగిరీలో ఉంటాయి. ఇక ఆ తర్వాత మిగిలే 20 శాతాన్ని పొదుపు చేసుకోవాలి. ఈ 20 శాతాన్ని స్టాక్ మార్కెట్, మ్యూచువల్స్ ఫండ్స్ లేదా ఇతర వాటిల్లో పెట్టుబడి పెట్టాలి.
పెట్టుబడి పెట్టేముందు రిస్క్ గురించి కూడా ఆలోచించుకోవాలి. ఒకేచోట మొత్తం పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. కొంతమొత్తం స్టాక్ మార్కెట్‌లో, మరికొంత మ్యూచువల్ ఫండ్స్‌లో, ఇంకోంత గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. మీ పెట్టుబడిని ఎప్పుటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అది పెరుగుతుందా.. లేదా పెట్టుబడి వేరేదానికి మళ్లించాలా? అనేది చూసుకుంటూ ఉండాలి. ఇక మీకు జీతం పెరిగినప్పుడు పెట్టుబడి మరింత పెంచాలి. ఈ 50/30/20 ఫార్మాలా పాటించడం వల్ల మీరు దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు? అనే విషయం క్లారిటీ ఉండటంతో పాటు భవిష్యత్తు అసరాలకు పొదుపు కూడా ఎక్కువ చేసుకోవచ్చు. పొదుపు చేసిన డబ్బులు మీ పిల్లలు పెద్దవారు అయ్యేసరికి వారి ఉన్నత చదువులు, పెళ్లిళ్లకు ఉపయోగపడతాయి. మీకు ఆర్ధిక భారం తగ్గుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..