Credit Card Tips: ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఈ 3 పనులు చేస్తే అప్పుల పాలవడం ఖాయం.. చేయకూడని తప్పులివే..

క్రెడిట్ కార్డ్ ఎలా వాడాలో తెలియక చాలామంది అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు. బిల్లులు చెల్లించలేక సతమతమవుతూ ఉంటారు. ఒకటి కంటే ఎక్కువ కార్డులు వాడుతున్నప్పుడు మరింతగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండటం మంచిదా..? లేదా? అనే విషయాలు తెలుసుకుందాం.

Credit Card Tips: ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఈ 3 పనులు చేస్తే అప్పుల పాలవడం ఖాయం.. చేయకూడని తప్పులివే..
Credit Card 5

Updated on: Jan 20, 2026 | 1:47 PM

ఆర్ధిక పరిస్ధితులు, ఆఫర్లు, డిస్కౌంట్లు, ఇతర అవసరాల కారణంగా ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను వాడేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. బ్యాంకులు ఆఫర్లు ఇస్తున్నాయని లేదా ఫోన్లు చేసి బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయనే కారణంతో కస్టమర్లు క్రెడిట్ కార్డులు తీసుకుంటూ ఉంటారు. రకరకాల బ్యాంకులు క్రెడిట్ కార్డులపై విభిన్న రకాల ఆఫర్లు ఇస్తున్నాయి. ఒకే బ్యాంకు క్రెడిట్ కార్డు ఉంటే మిగతా బ్యాంకులు ఇచ్చే ఆఫర్లు వినియోగించుకోవడానికి కుదరడం లేదు. దీంతో ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేసినా అదే ఉంటుందిలే అనే ఉద్దేశంతో చాలామంది తీసుకుంటూ ఉంటారు. క్రెడిట్ కార్డులపై ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఇచ్చే ఆఫర్లకు ఆకర్షితులై మరికొంతమంది ఎక్కువ కార్డులు వాడుతూ ఉంటారు. ఇలా ఎక్కువ కార్డులు వాడటం వల్ల ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు.

క్రెడిట్ స్కోర్‌కు ముప్పు

ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే సిబిల్ స్కోర్‌పై ప్రభావితం చూపిస్తాయి. మీ దగ్గర ఎక్కువ కార్డులు ఉన్నప్పుడు టైమ్‌కి బిల్ తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. తిరిగి గడువులోగా బిల్ చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ భారీగా పతనమవుతుంది. ఇక ఒకటి లేదా రెండు కార్డులు ఉంటే పర్వాలేదు. అదే పనిగా ఎక్కువ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది కాదు. ఇలా ఎక్కువ అప్లికేషన్స్ పెట్టుకుంటే మీరు రుణాలపై ఎక్కువ ఆధారపడుతున్నట్లు బ్యాంకులు అర్థం చేసుకుంటాయి. దీంతో వల్ల మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది.

తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు

ఒకటి లేదా రెండు కార్డులను నిర్వహించడం సులభంగా ఉంటుంది. ఎక్కువ కార్డులు ఉన్నప్పుడు బిల్లులు చెల్లించడంలో అయోమయం నెలకొంటుంది. ప్రతీ కార్డుకు బిల్లింగ్ సైకిల్, గుడవు తేదీ, వడ్డీ రేటు వేర్వురుగా ఉంటుంది. మీరు ఒక్కసారి మిస్ చేసినా లేట్ ఛార్జీలు, వడ్డీలు అధికంగా కట్టాల్సి వస్తుంది. ఇది సిబిల్ స్కోర్‌ పడిపోయేలా చేస్తుంది.

ఇలా వాడితే లాభమే..

ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండటం వల్ల మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుందని చాలామంది అనుకుంటారు. అది కొంతవరకు నిజమే కానీ మీరు సక్రమంగా వినియోగించాల్సి ఉంటుంది. కార్డు పాతదై అయి ఉండాలి. అరుదుగా కార్డును వాడటంతో పాటు ప్రతీ నెలా బిల్లులు టైమ్‌కు చెల్లించాలి. అదే కార్డు కొత్తదై మీరు తరచుగా ఉపయోగిస్తుంటే నష్టం జరుగుతుంది. ఒకటి కంటే ఎక్కవ కార్డులు ఉన్నప్పుడు ఒకేసారి క్యాన్సిల్ చేసుకోవద్దు. నెమ్మదిగా ఒక్కొకటి క్లోజ్ చేసుకోండి. ఒకేసారి క్లోజ్ చేయడం వల్ల సిబిల్‌కు నష్టం జరుగుతందని నిపుణులు చెబుతున్నారు.