Credit Card: ఈ ప్లాన్‌తో మీ క్రెడిట్ కార్డు సేఫ్.. డబ్బులు పోగొట్టుకున్నా తిరిగి ఇచ్చేస్తారు..

ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. వివిధ మార్గాల ద్వారా సైబర్ నేరగాళ్లు బుట్టలో వేసుకుని మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా డబ్బులు కొల్లగోడుతున్నారు. ఇలాంటి మోసాల నుంచి కస్టమర్లను కాపాడేందుకు కార్డు ప్రొటెక్షన్ ప్లాన్‌లు బ్యాంకులు తీసుకొచ్చాయి. వాలంటరీగా వీటిని కస్టమర్లు తీసుకోవచ్చు.

Credit Card: ఈ ప్లాన్‌తో మీ క్రెడిట్ కార్డు సేఫ్.. డబ్బులు పోగొట్టుకున్నా తిరిగి ఇచ్చేస్తారు..
Credit Card

Updated on: Nov 30, 2025 | 7:17 AM

Credit Card Protection Plan: ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్, టీవీ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా ఇతర వస్తువులు ఏవైనా కొనాలంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది క్రెడిట్ కార్డు. ఎందుకంటే క్రెడిట్ కార్డులపై ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్, బ్యాంకులు భారీ డిస్కౌంట్స్ ఆఫర్లు చేస్తున్నాయి. ఇక షాపింగ్ మాల్స్ కూడా పండుగల సమయంలో క్రెడిట్ కార్డులపై భారీ తగ్గింపును ప్రకటిస్తున్నాయి. దీంతో క్రెడిట్ కార్డు అనేది అవసరం లేకపోయినా ఆఫర్ల కోసం తీసుకునే కస్టమర్లు చాలామంది ఉంటారు. క్రెడిట్ కార్డు తీసుకున్నాక సైబర్ నేరగాళ్ల నుంచి రక్షించుకుని మీ కార్డును భద్రంగా ఉంచుకునేందుకు క్రెడిట్ కార్డ్ ప్రొటక్షన్ ప్లాన్ తీసుకోవాలని చాలా బ్యాంకులు కోరుతూ ఉంటాయి. అసలు ఈ ప్రొటక్షన్ ప్లాన్ ఏంటి? ఇది తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలు చూద్దాం.

ఒకవేళ మీరు కార్డును పోగొట్టుకుంటే..

క్రెడిట్ కార్డును మీరు పొరపాటున పోగొట్టుకున్నా.. ఎవరైనా దొగలించినా క్రెడిట్ కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవడం వల్ల సేఫ్టీ ఉంటుంది. క్రెడిట్ కార్డు పోగొట్టుకున్నప్పుడు మీరు అన్ని బ్యాంకులకు ఫోన్ చేసి కార్డ్ బ్లాక్ చేయాల్సిన అవసరం ఉండదు. మీకు ఉన్న అన్ని క్రెడిట్ కార్డులను ప్రొటెక్షన్ ప్లాన్‌లో లింక్ చేస్తే.. ఒక్క ఫోన్ కాల్‌తో ఒకేసారి అన్ని బ్లాక్ అవుతాయి. అన్ని బ్యాంకులకు ఫోన్ చేసి బ్లాక్ చేసుకోవాల్సిన అసవరం ఉండదు.

కార్డులు చోరీకి గురైనప్పుడు..

క్రెడిట్ కార్డులు చోరీకి గురై ఆ కార్డు నుంచి ట్రాన్సక్షన్ జరిగినప్పుడు ఈ ప్లాన్ మీకు రక్షణగా నిలుస్తుంది. మీ క్రెడిట్ కార్డు నుంచి అనధికార లావాదేవీలు జరిగినప్పుడు బ్యాంకులు మీకు పరిహారం చెల్లిస్తాయి. కార్డు పోయిన 7 నుంచి 15 రోజలు వరకు ఇలాంటి ఆన్‌లైన్ మోసాల వల్ల జరిగే లావాదేవీలపై పరిహారం చెల్లిస్తారు. దీని వల్ల మీకు కూడా ఆర్ధిక నష్టం ఉండదు.

ఆర్ధిక సహాయం

ఇక మీరు ఇతర దేశాల్లో ఉన్నప్పుడు క్రెడిట్ కార్డును పోగొట్టుకుంటే మీకు ప్రొటెక్షన్ ప్లాన్ ద్వారా ఎమర్జెన్సీ అడ్వాన్స్ ఫండ్స్ మంజూరు చేస్తారు. హోటల్ బిల్లులు లేదా ప్రయాణ టిక్కెట్లను ఈ నగదు ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. కేవలం 48 గంటల్లోనే ఈ అడ్వాన్స్ డబ్బలును మీ అకౌంట్లో జమ చేశారు. వీటిని 28 రోజుల్లో ఎలాంటి వడ్డీ లేకుండా చెల్లించవచ్చు. క్రెడిట్ కార్డు చోరీకి గురైనప్పుడు మీకు అత్యవసరంగా డబ్బులు కావాలంటే ఈ ప్రొటెక్షన్ ప్లాన్ సహాయపడుతుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి