AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: క్రెడిట్ కార్డ్ వాడకపోతే సిబిల్ స్కోర్ పడిపోతుందా..? ఇది తెలుసుకోకపోతే డేంజర్ జోన్‌లో పడినట్లే..

క్రెడిట్ కార్డుల వినియోగం ఇటీవల భారీగా పెరిగిపోయింది. ప్రతీఒక్కరూ కార్డులను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే కొంతమంది ఆఫర్లు, డిస్కౌంట్ కోసం కార్డు వాడుతూ ఉంటారు. కొంతమంది కార్డు తీసుకున్నాక దానిని వాడటం మానేస్తారు. ఇలాంటి సమయంలో సిబిల్ స్కోర్‌పై ప్రభావితం పడుతుందా..?

Credit Card: క్రెడిట్ కార్డ్ వాడకపోతే సిబిల్ స్కోర్ పడిపోతుందా..? ఇది తెలుసుకోకపోతే డేంజర్ జోన్‌లో పడినట్లే..
Credit Card Rules
Venkatrao Lella
|

Updated on: Apr 28, 2026 | 7:01 PM

Share

ఇటీవల కాలంలో చాలామంది క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. ఉద్యోగం, వ్యాపారం చేసేవారితో పాటు ఇతర వర్గాల ప్రజలు కూడా వీటిని వినియోగిస్తున్నారు. అయితే కొంతమంది క్రెడిట్ కార్డు తీసుకున్నా దానిని ఉపయోగించకుండా అలాగే తమ వద్ద ఉంచుకుంటారు. ఇలా వాడకపోతే ఏమవుతుంది..? క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుతుందా..? అనే అనుమానాలు చాలామందికి ఉంటాయి. క్రెడిట్ కార్డును జారీ చేసే సమయంలో మీ సిబిల్ స్కోర్‌ను సంస్థలు పరిశీలిస్తాయి. క్రెడిట్ స్కోర్ బాగుంటేనే కార్డును అందిస్తాయి. మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడాలన్నా కార్డును సమర్థవంతంగా ఉపయోగించాలి.

సిబిల్ స్కోర్ తగ్గుతుందా..?

మీరు క్రెడిట్ కార్డు వాడకపోయినా మీరు సిబిల్ స్కోర్ అనేది తగ్గదు. అయితే మీరు చాలాకాలం పాటు వాడకపోతే మీ క్రెడిట్ హిస్టరీ అనేది తగ్గుతుంది. దీని వల్ల మీ క్రెడిట్ కార్డు జారీ చేసిన వ్యక్తి మీ కార్డును నిలిపివేయవచ్చు. దీని వల్ల సిబిల్ స్కోర్‌పై స్వల్ప ప్రభావం పడవచ్చు. మీరు సిబిల్ స్కోర్‌ను పెంచుకోవాలంటే క్రెడిట్ హిస్టరీ మెరుగ్గా ఉండాలి. క్రెడిట్ కార్డు ఈఎంఐలు సకాలంలో చెల్లించడం, బిల్లులు టైమ్‌కు క్లియర్ చేయడం, క్రెడిట్ కార్డులపై ఖర్చులు చేయడం వంటి అంశాలన్నీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుతాయి. మీకు లోన్ కావాలంటే మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలి. మీకు క్రెడిట్ కార్డు ఉండి దానిని వినియోగించని సమయంలో మీ అకౌంట్ మూసివేయవచ్చు.  క్రెడిట్ కార్డును మూసివేయడం వల్ల మీ క్రెడిట్ హిస్టరీ అనేది తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే మీరు క్రెడిట్ కార్డును అప్పుడప్పుడు ఉపయోగిస్తూ ఉండాలి. బిల్లు సకాలంలో చెల్లిస్తూ ఉండాలి. దీని వల్ల మీ క్రెడిట్ హిస్టరీ అనేది మరింత మెరుగుపడుతుంది. ఇలాంటప్పుడు భవిష్యత్తులో మీరు రుణాలు సులువుగా పొందవచ్చు.

క్రెడిట్ కార్డు వాడుతున్నారా..?

క్రెడిట్ కార్డు ఉండి దానిని వాడకపోవడం వల్ల మీకు స్వల్ప నష్టం జరుగుతుంది. అదే అప్పుడప్పుడు వాడి సకాలంలో బిల్లు చెల్లిస్తే మీకు లాభం జరుగుతుంది. చాలామందికి క్రెడిట్ కార్డు ఎలా వాడాలనేది తెలియదు. దీంతో అప్పులపాలవుతూ ఉంటారు. ఈఎంఐలు, బిల్లులు కట్టలేక సతమతమవుతూ ఉంటారు. కొంతమంది ఆఫర్లు, డిస్కౌంట్స్ కోసం కార్డు తీసుకుని డబ్బులు పొదుపు చేసుకుంటూ ఉంటారు. దీంతో  క్రెడిట్ కార్డు తీసుకునే సమయంలో దానిని ఎలా వాడాలనే విషయంపై అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. బ్యాంకులు,  ఆర్ధిక సంస్థలు పోటీ పడి మరి కార్డులను ఆఫర్ చేస్తూ ఉంటాయి. మీరు వీటి ఉచ్చులో పడవద్దు.

Follow Us
మామూలు క్రేజ్ కాదు భయ్యా.. 12 రోజుల్లో 1.5 కోట్ల అప్లికేషన్లు..
మామూలు క్రేజ్ కాదు భయ్యా.. 12 రోజుల్లో 1.5 కోట్ల అప్లికేషన్లు..
లెమన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి!
లెమన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి!
ఎలుగుబంటి దాడి.. మృత్యువు అంచున బాలుడు.. అంతలో..
ఎలుగుబంటి దాడి.. మృత్యువు అంచున బాలుడు.. అంతలో..
తెలంగాణలో మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త సెక్యూరిటీ పేపర్..
తెలంగాణలో మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త సెక్యూరిటీ పేపర్..
సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..
సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..
ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా..ఇది నిజంగా
ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా..ఇది నిజంగా
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!