Credit Card: క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకోవడం మంచిదా..? కాదా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి

క్రెడిట్ కార్డులు ఉన్నవారికి బ్యాంకులు దానిపై లోన్ ఆఫర్ చేస్తాయి. లోన్ తీసుకోండి అంటూ బ్యాంకు ప్రతినిధులు ఫోన్ చేస్తూ ఉంటారు. దీంతో చాలామంది అత్యవసర సమయాల్లో తీసుకుంటూ ఉంటారు. ఇలా క్రెడిట్ కార్డుపై వచ్చే లోన్ తీసుకోవడం నిజంగా మంచిదేనా..?

Credit Card: క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకోవడం మంచిదా..? కాదా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి
Credit Card

Updated on: Nov 22, 2025 | 11:31 AM

క్రెడిట్ కార్డ్.. ఇప్పటి ఆర్ధిక పరిస్ధితుల్లో ప్రతీఒక్కరి దగ్గర ఇది ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులే కాకుండా మిగతావారు కూడా క్రెడిట్ కార్డులను తీసుకుంటున్నారు. అత్యవసర సమయాల్లో డబ్బులు అవసరమైనప్పుడు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో చాలామంది క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. వీటితో పాటు ఆఫర్లు, డిస్కౌంట్స్ లాంటి అనేక బెనిఫిట్స్ ఉండటంతో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగిపోయింది. బ్యాంకులు కూడా పోటీ పడి కస్టమర్లకు క్రెడిట్ కార్డులు జారీ చేస్తు్న్నాయి.

అయితే డబ్బులు వెంటనే అవసరమైనప్పుడు చాలామంది పర్సనల్ లోన్ తీసుకుంటారు. పర్సనల్ లోన్లకు వడ్డీ ఎక్కువ వసూలు చేస్తాయి బ్యాంకులు. అంతేకాకుండా సర్వీస్ ఛార్జీలు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇక అర్జంట్‌గా డబ్బులు కావాలనుకున్నప్పుడు కొంతమంది క్రెడిట్ కార్డులపై వచ్చే లోన్ వైపు మొగ్గు చూపుతారు. క్రెడిట్ కార్డు లోన్ తీసుకోవడం మంచిదేనా? కాదా అనే వివరాలు చూద్దాం.

సిబిల్ స్కోర్‌పై ప్రభావం

క్రెడిట్ కార్డులపై వచ్చే లోన్‌ కావాలనుకుంటే ప్రాసెస్ చాలా సులువుగా ఉంటుంది. అప్లై చేయగానే వెంటనే డబ్బులు మన బ్యాంకు అకౌంట్లో జమ అవుతాయి. క్రెడిట్ కార్డు లిమిట్‌ను బట్టి లోన్ ఎంత ఇవ్వాలనేది బ్యాంకులు నిర్ణయిస్తాయి. క్రెడిట్ కార్డుపై తీసుకున్నా.. ఈ లోన్‌ను ప్రత్యేక లోన్‌గా బ్యాంకులు పరిగణిస్తాయి. కానీ క్రెడిట్ కార్డు లోన్స్‌కు వడ్డీ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ప్రాసెసింగ్ ఫీజు కూడా కలెక్ట్ చేశారు. క్రెడిట్ కార్డులపై లోన్ తీసుకుంటే సిబిల్ స్కోర్‌పై ప్రభావితం పడుతుంది. సో క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకోవాలనుకుంటే ఒకసారి ఆలోచించడం మంచిది. అత్యవసరమైతే తప్పు తీసుకోకపోవడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..