Bank accounts: ఒకే బ్యాంక్ అకౌంట్ ఉండటం మంచిదా..? లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మంచిదా..?

ఇండియాలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ. దీంతో దేనికైనా సరే ఒకే బ్యాంక్ అకౌంట్‌ను వాడుతూ ఉంటారు. అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా సరే మూడు బ్యాంక్ అకౌంట్లను మెయింటైన్ చేయాలని సూచిస్తున్నారు.

Bank accounts: ఒకే బ్యాంక్ అకౌంట్ ఉండటం మంచిదా..? లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మంచిదా..?

Updated on: Nov 19, 2025 | 11:45 AM

Bank accounts For money: బ్యాంక్ అకౌంట్ అనేది ప్రతిఒక్కరికీ అవసరమనేది మనకు తెలిసిందే. సామాన్యుడి నుంచి బిలియనీర్ వరకు ప్రతీఒక్కరూ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా అవసరం. కొంతమంది ఒకే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటే.. మరికొంతమందికి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. సింగిల్ బ్యాంక్ అకౌంట్ ఉండటం మంచిదా? లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లు ఉండటం మంచిదా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. దానికి సమాధానాలు ఈ స్టోరీలో చూద్దాం.

ప్రతీఒక్కరూ మూడు బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉండటం మంచిదని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. మీ డబ్బులపై కంట్రోల్ ఉండటానికి వివిధ బ్యాంకుల్లో మూడు అకౌంట్లు ఉంటే మంచిదని సూచిస్తున్నారు. ఈ మూడింటిల్లో సేవింగ్స్ అకౌంట్ ఒకటి, ఇన్వెస్ట్‌మెంట్ కోసం మరొకటి, ఎక్స్‌పెన్స్ కోసం ఇంకోక అకౌంట్ ఉపయోగించాలని చెబుతున్నారు. ఇలా ఉంచుకోవడం వల్ల మన నెలవారీ ఖర్చులు, సేవింగ్స్ , ఇన్వెస్ట్‌మెంట్స్ లెక్కలన్నీ క్లారిటీగా తెలుస్తాయని అంటున్నారు.

సేవింగ్స్ అకౌంట్

అత్యవసర ఖర్చులు, రోజువారీ ఖర్చుల కోసం సేవింగ్స్ అకౌంట్ ఉపయోగించాలి. ఖర్చులు పోగా మిగిలిన డబ్బులను మిగతా రెండు అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేయాలని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్లపై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులో ఈ అకౌంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్

మన సేవింగ్స్‌ను పెంచుకోవడానికి ఈ అకౌంట్ ఉపయోగించాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి లేదా ఇతర ఇన్వెస్ట్‌మెంట్స్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడానికి వినియోగించాలి. దీని వల్ల  మీరు ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడెక్కడ చేస్తున్నారు.. ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేశారు అనేది ఈజీగా తెలుస్తుంది.

ఎక్స్‌పెన్స్ అకౌంట్

రెంట్, ఈఎంఐలు, సరుకులు, ఇంటికి కావాల్సిన వస్తువులు, ట్రాన్స్‌పోర్ట్, దుస్తులు లాంటివి కొనుగోలు చేయడానికి ఈ అకౌంట్ వినియోగించాలి. ఎక్స్‌పెన్స్ కోసం సపరేట్ అకౌంట్ ఉపయోగించడం వల్ల మీ లైఫ్‌స్ట్రైల్ కోసం ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారనేది తెలుస్తుంది. దీని వల్ల మీ సరదాలకు పెట్టే ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి