Gold: బంగారం కొంటున్నారా? ఈ 7 అంశాలను తప్పక గమనించండి.. లేదంటే నష్టపోతారు..

|

Apr 24, 2023 | 7:28 AM

భారతీయులు బంగారంపై పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితంగా భావిస్తారు. శనివారం అక్షయ తృతీయ సందర్భంగా ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో రూ.250 కోట్ల విలువైన బంగారం విక్రయాలు జరిగాయంటేనే అర్థం చేసుకోవచ్చు. మీరు కూడా ఆభరణాలు, నాణెం లేదా బిస్కెట్లు వంటి ఏదైనా బంగారు వస్తువును కొనుగోలు చేసినట్లయితే.. భవిష్యత్తులో మీరు నష్టపోకుండా ఉండాలంటే,

Gold: బంగారం కొంటున్నారా? ఈ 7 అంశాలను తప్పక గమనించండి.. లేదంటే నష్టపోతారు..
Buy Gold
Follow us on

భారతీయులు బంగారంపై పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితంగా భావిస్తారు. శనివారం అక్షయ తృతీయ సందర్భంగా ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో రూ.250 కోట్ల విలువైన బంగారం విక్రయాలు జరిగాయంటేనే అర్థం చేసుకోవచ్చు. మీరు కూడా ఆభరణాలు, నాణెం లేదా బిస్కెట్లు వంటి ఏదైనా బంగారు వస్తువును కొనుగోలు చేసినట్లయితే.. భవిష్యత్తులో మీరు నష్టపోకుండా ఉండాలంటే, దాని బిల్లుపై ఈ 7 అంశాలను ఖచ్చితంగా చెక్ చేయాలి.

ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుండి, దేశంలో గోల్డ్ హాల్‌మార్కింగ్ కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. హాల్‌మార్క్ బంగారం స్వచ్ఛతను గుర్తిస్తుంది. కాబట్టి ముందుగా మీరు కొనుగోలు చేసిన బంగారానికి హాల్‌మార్క్ ఉందో లేదో నిర్ధారించుకోవాలి.

బంగారు కొనుగోలు బిల్లుపై ఈ 7 అంశాలను చెక్ చేయండి..

బంగారం కొనుగోలు తరువాత దానికి సంబంధించిన బిల్లు చాలా ముఖ్యం. భవిష్యత్తులో బంగారాన్ని విక్రయించే సందర్భంలో.. సరైన విలువను పొందడానికి ఇది మీకు సహాయపడుతుంది. అదే సమయంలో, వివాదం విషయంలో కీలకంగా ఉంటుంది. అందుకే.. మీరు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాల బిల్లులో ఈ 7 వివరాలు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

1. వస్తువు పేరు, వివరణ: బిల్లులో తప్పనిసరిగా బంగారు గొలుసు, దాని ఐటెమ్ నంబర్ వంటి వివరాలు పూర్తిగా ఉండాలి.

2. ఎన్ని నగలు తీసుకున్నారు: బిల్లులో మీరు ఎన్ని వస్తువులు తీసుకున్నారనే సమాచారం ఉండాలి.

3. బరువు: మీరు కొనుగోలు చేసిన బంగారు వస్తువు ఖచ్చితమైన బరువు ఎంత. ఈ వివరాలు బిల్లుపై ఉండాలి.

4. స్వచ్ఛత: బంగారం 22 క్యారెట్, 18 క్యారెట్, 24 క్యారెట్ సమాచారం బిల్లుపై ఉండాలి.

5. గోల్డ్ రేట్: మీరు కొనుగోలు చేసిన రోజు బంగారం ధర ఎంత, మేకింగ్ ఛార్జీలుగా మీ ఆభరణాల వ్యాపారి ఎంత వసూలు చేశారు. ఈ సమాచారం కూడా బిల్లులో ఉండాలి.

6. రత్నం లేదా వజ్రం వివరాలు: మీ బంగారు వస్తువులో ఏదైనా రత్నం, విలువైన రాయి లేదా వజ్రం పొందుపరచబడి ఉంటే, దాని వివరాలను కూడా బిల్లులో పేర్కొనాలి. ఇందులో ఆ వస్తువు క్యారెట్, ధర మొదలైనవి ఉంటాయి.

7. ధర: మీరు చేసిన కొనుగోళ్ల మొత్తం విలువ ఎంత, అది కూడా బిల్లులో ఉండాలి.

దీనితో పాటు, బిల్లుపై హాల్‌మార్కింగ్ ఛార్జీలను కూడా ప్రస్తావిస్తున్నారు. 2022 మార్చి 4 నుంచి హాల్‌మార్కింగ్ ఛార్జ్ రూ.45కి పెరిగింది. అంతకుముందు రూ.35 ఉంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..