Gold Loan: గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది తీసుకుంటే మీకు మంచిది..? ఇలా తెలుసుకోండి

బ్యాంకుల నుంచి గోల్డ్ లోన్ తీసుకోవడం మంచిదా? లేదా పర్సనల్ లోన్ బెటర్‌నా? ఇలాంటి కన్‌ప్యూజన్ మనలో చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు. ఏ లోన్ తీసుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటివారి కోసం ఏది మంచిది? అనే విషయాలు ఇందులో చూద్దాం.

Gold Loan: గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది తీసుకుంటే మీకు మంచిది..? ఇలా తెలుసుకోండి
Gold Loan

Updated on: Dec 04, 2025 | 2:02 PM

Personal Loan: ఆర్ధిక పరిస్ధితుల కారణంగా వ్యవసాయదారుడు నుంచి ఉద్యోగి వరకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం సాధారణం అయిపోయింది. బ్యాంకులు కూడా తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు లోన్లు తెగ ఆఫర్లు చేస్తున్నాయి. కస్టమర్లకు ఫోన్లు చేసి మరీ లోన్లు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉంటాయి. అనేక లోన్లు ఆప్షన్లు బ్యాంకుల్లో అందుబాటులో ఉన్నాయి. కొంతమంది తమ వద్ద ఉన్న గోల్డ్‌ను తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటారు. మరికొంతమంది పర్సనల్ లోన్ తీసుకుంటూ ఉంటారు. ఈ రెండిటిల్లో ఏది మంచిది అనే విషయాలు తెలుసుకుందాం.

డబ్బులు మీకు అత్యవసరమా..?

డబ్బులు మీకు అత్యవసరంగా కావాలంటే గోల్డ్ లోన్ వైపు మొగ్గు చూపవచ్చు. ఎందుకంటే ఈ లోన్ వెంటనే మంజూరు చేస్తారు. మీ గోల్డ్ ఇవ్వగానే నిమిషాల్లో లోన్ డబ్బులు మీ అకౌంట్లో జమ చేస్తారు. పర్సనల్ లోన్ తీసుకోవాలంటే ఇన్‌కమ్ డాక్యుమెంట్స్, సిబిల్ స్కోర్, మీ ఉద్యోగం స్టేటస్ వంటివి బ్యాంకులు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల ఈ లోన్ ప్రాసెస్ లేట్ అవుతుంది. అందుకే డబ్బులు అర్జెంట్‌గా కావాలనుకుంటే గోల్డ్ లోన్‌నే ఎంచుకోవాలి

సిబిల్ స్కోర్ చూసుకోండి

మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే పర్సనల్ లోన్‌పై అధిక వడ్డీ వసూలు చేస్తాయి బ్యాంకులు. బాగా తక్కువగా ఉంటే మీ లోన్ రిజెక్ట్ కావొచ్చు. ఎక్కువగా లోన్స్ కోసం అప్లై చేయడం కూడా క్రెడిట్ స్కోర్‌పై ప్రభావితం చూపుతుంది. అందుకే సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే పర్సనల్ లోన్ జోలికి పోకండి. మీ బంగారం తాకట్టులో ఉంటుంది కాబట్టి సిబిల్ స్కోర్‌ తక్కువగా ఉన్నా మీకు గోల్డ్ లోన్ ఇస్తారు.

ఒకేసారి డబ్బులు

ఇక గోల్డ్ లోన్లకు కాలపరిమితి ముగిశాక ఒకేసారి వడ్డీతో సహా మీరు తీసుకున్న సొమ్మును చెల్లించే సౌకర్యం ఉంటుంది. ఇక మీరు ఉద్యోగం లేదా వ్యాపారం నడుపుతుంటే మీ దగ్గర నెలనెలా ఈఎంఐలు కట్టడానికి డబ్బులు సరిపోకపోవచ్చు. అదే గోల్డ్ లోన్ ఈఎంఐ తీసుకుంటే ఒకేసారి డబ్బులు ఉన్నప్పుడు చెల్లించవచ్చు.

కాలవ్యవధిని దృష్టిలో పెట్టుకోండి

గోల్డ్ లోన్ కాలవ్యవధి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది. అదే పర్సనల్ లోన్ తీసుకుంటే ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది. మీరు త్వరగా అప్పుల్లో నుంచి బయటపడాలంటే గోల్డ్ లోన్ మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఇక గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. అదే పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో మీ దగ్గర గోల్డ్ ఉన్నప్పుడు పర్సనల్ లోన్ జోలికి పోకుండా గోల్డ్ లోన్ తీసుకోవడమే మంచిది.