Gold Silver Price Today: పరుగులు ఆపనంటోన్న పసిడి.. మళ్లీ పెరిగిన ధరలు.. ఎంత ధర పెరిగిందంటే..

Gold and Silver Price Today: గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఇవాళ కూడా పెరిగాయి. ఇటీవల తగ్గినట్లే కనిపించినా.. అది ఒకటి రెండు రోజులకే పరిమితమైంది. ఇప్పుడు మళ్లీ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. తాజాగా గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. బుధవారం నాడు దేశీయ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం...

Gold Silver Price Today: పరుగులు ఆపనంటోన్న పసిడి.. మళ్లీ పెరిగిన ధరలు.. ఎంత ధర పెరిగిందంటే..
Gold And Sliver Price Today

Updated on: Apr 27, 2023 | 7:00 AM

గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఇవాళ కూడా పెరిగాయి. ఇటీవల తగ్గినట్లే కనిపించినా.. అది ఒకటి రెండు రోజులకే పరిమితమైంది. ఇప్పుడు మళ్లీ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. తాజాగా గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. బుధవారం నాడు దేశీయ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 లు ఇవాళ రూ. 100 పెరిగి అది రూ. 55,950 కి పెరిగింది. అదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 110 పెరిగి రూ. 61,040 గా ఉంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.200 తగ్గింది. ప్రస్తుత మార్కెట్‌లో కిలో వెండి రూ. 76,500 పలుకుతోంది. మరి, దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు..

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,190 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,420, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,550, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,040 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వెండి ధరలు ఇలా ఉన్నాయి..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,500 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.76,500, చెన్నైలో కిలో వెండి ధర రూ.80,200, బెంగళూరులో రూ.80,200, కేరళలో రూ.80,200, కోల్‌కతాలో రూ.76,500, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,200, విజయవాడలో రూ.80,200, విశాఖపట్నంలో రూ.80,200 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us