
అరుదైన కరెన్సీ నోట్లు, కాయిన్స్‌ను సేకరించే అలవాటు కొంతమందికి ఉంటుంది. వాళ్లు పాత కాలం నాటి కాయిన్స్, నోట్లను సేకరించి వాటిని తమ వద్ద ఉంచుకుంటారు. ఇక కొంతమంది వాటిని వేలంలో విక్రయించి ఎక్కువ సొమ్ము సొంతం చేసుకుంటారు. కరెన్సీ నోట్లపై ఉండే సీరియల్ నెంబర్లు, ఫొటోలకు కూడా ప్రత్యేకత ఉంటుంది. ఈ అరుదైన కరెన్సీ నోట్లు మీ దగ్గర ఉంటే లక్షలు సంపాదించవచ్చు. మీ దగ్గరకు వచ్చే కరెన్సీ నోట్ల సీరియల్ నెంబర్లలో 786 అనే సంఖ్య ఉంటే మీకు ఆ నోటు విలువ కంటే భారీ మొత్తంలో చెల్లిస్తారు. మీరు ఆన్‌లైన్‌లో ఆ నోటును సేల్ చేయవచ్చు. ఆర్‌బీఐ అధికారికంగా దీనికి అనుమతి ఇవ్వనప్పటికీ.. పలు ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో 786 సిరీస్ నెంబర్ నోటుకు మంచి డిమాండ్ ఉంది.
786 సీరిస్ నెంబర్లను భారత్‌తో పాటు పలు దేశాల్లో శుభ సంఖ్యగా నమ్ముతారు. అందుకే ఈ నెంబర్ గల నోట్లను సేకరించేందుకు లేదా కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతారు. అలాంటి నెంబర్ సీరియల్ గల నోట్లు మీ దగ్గర ఉంటే ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచవచ్చు. లేదా మీరు ఆ కరెన్సీ నోటు కంటే ఎక్కువ రేటుకు విక్రయానికి ఉంచోచ్చు.ప్రముఖ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ ebayతో పాటు మరికొన్ని వెబ్‌సైట్లలో ఆ నోట్లను అమ్ముకోవచ్చు. ఆ సీరిస్ నెంబర్ గల చిరిగిన, పాత నోట్లను కూడా విక్రయించవచ్చు.
currency
ebay వెబ్‌సైట్‌లో 789 సిరీస్ నెంబర్ గల రూ.50 నోటు 40 లేదా 50 డాలర్లకు అమ్ముడుపోతుంది. అంటే మీ దగ్గర ఆ సిరీస్ నెంబర్ గల ఒక రూ.50 నోటు ఉంటే ఇండియన్ కరెన్సీలో రూ.3 వేల వరకు వస్తాయి.ఇక రూ.500 నోట్లు ఎక్కువ ఉంటే ఇక లక్షలు వరకు సంపాదించవచ్చన్నమాట. ఇక పాత 25 పైసలు, 50 పైసల నాణేలకు 4 నుంచి 6 డాలర్ల వరకు చెల్లిస్తున్నారు. ఇక నాణెం పాతకాలం లేదా అరుదైనది అయితే ఇంకా ఎక్కువ మొత్తంలో చెల్లిస్తారు. ఇండియన్ కరెన్సీకే కాకుండా 786 సిరీస్ నెంబర్ కలిగిన అన్నీ దేశాల కరెన్సీకి ఇలాగే డిమాండ్ ఉంది.
www.ebay.com వెబ్‌సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేసి విక్రేతగా నమోదు చేసుకోండి. ఆ తర్వాత నోటుకు సంబంధించిన ఫొటోలు అప్‌లోడ్ చేసుకోండి. నోటుకు కొనుగోలు చేయాలనుకునేవారు మిమ్మల్ని సంప్రదిస్తారు.