Train Ticket Booking: ట్రైన్‌లో లోయర్ బెర్త్ కావాలా..? ఇలా టికెట్ బుక్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది.. ఒకసారి చూడండి

ఇండియాలో ట్రైన్ జర్నీని ఇష్టపడివారంటూ ఎవరూ ఉండరు. సౌకర్యవంతంగా ప్రయాణం చేసే అవకాశం రైళ్లల్లో అందుబాటులో ఉండటంతో.. దూరపు ప్రదేశాలు వెళ్లాలనుకునేవారికి దీనినే ఎంచుకుంటారు. వృద్దులు, గర్బిణులతో కలిసి ప్రయాణం చేయాలనుకునే సమయంలో వారికి లోయర్ బెర్త్‌ను ఎంచుకుంటారు. ఇలాంటప్పుడు ఎలా లోయర్ బెర్త్ వస్తుందో ఇందులో తెలుసుకోండి..

Train Ticket Booking: ట్రైన్‌లో లోయర్ బెర్త్ కావాలా..? ఇలా టికెట్ బుక్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది.. ఒకసారి చూడండి
Train Lower Bearth

Updated on: Nov 24, 2025 | 3:33 PM

Train Lower Berth: మన దేశంలో ఎక్కువమంది ట్రైన్ ప్రయాణాన్ని ఇష్టపడతారు. కూర్చోవడానికి, తిరగడానికి సౌకర్యవంతంగా ఉండటంతో పాటు వాష్ రూమ్స్, ఇతర సౌకర్యాలు ఉంటాయనే కారణంతో రైళ్లల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే లాంగ్ జర్నీ సమయంలో బస్సులో అంత సౌకర్యవంతంగా ఉండదు. అందుకే లాంగ్ జర్నీ చేసేవారు ట్రైన్స్‌లోనే వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ట్రైన్లలో వృద్దులు, గర్బిణులు ప్రయాణం చేయాలనుకునేటప్పుడు లోయర్ బెర్తులను బుక్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల వారికి లోయర్ బెర్త్‌లు దక్కవు. టికెట్ బుక్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల లోయర్ బెర్త్ వచ్చే అవకాశముంది. అవేంటో చూద్దామా..

వృద్దులకు ప్రత్యేక కోటా

60 ఏళ్లు దాటిన వృద్దులు, 45 ఏళ్లు దాటిన మహిళలకు బెర్త్‌ల కేటాయింపుల్లో ప్రత్యేక కోటాను రైల్వేశాఖ అందిస్తోంది. దీని ద్వారా బుకింగ్ చేసుకునే సమయంలో సీనియర్ సిటీజన్ కోటా ఎంచుకుంటే లోయర్ బెర్త్‌లు కేటాయిస్తారు. కానీ టికెట్ బుకింగ్ చేసే సమయంలో వారితో పాటు నాన్ సీనియర్ సిటిజన్ సభ్యులు ఉంటే లోయర్ బెర్త్ రాకపోవచ్చు. అందుకే టికెట్ బుకింగ్ సమయంలో వృద్దులు, గర్భిణులు ఉంటే వారికి మీతో పాటు కాకుండా ప్రత్యేకంగా వేరే టికెట్లు బుక్ చేయాలి. అప్పుడు వారికి లోయర్ బెర్త్ కేటాయిస్తారు. ఒక టికెట్‌పై ఒకరు లేదా ఇద్దరు సీనియర్ సిటీజన్లు ప్రయాణించేటప్పుడు వారికి ఆ కోటా వరిస్తుంది. కానీ వారితో పాటు నాన్ సీనియర్ సిటిజన్ సభ్యులు ఒకే టికెట్‌పై బుక్ చేసుకుంటే జనరల్ కేటగిరీగా పరగణిస్తారు. అలాంటి సమయంలో లోయర్ బెర్త్ రాదు.

వేరే టికెట్ బుక్ చేయండి

స్లీపర్‌కు సంబంధించి ప్రతీ కోచ్‌లో ఏడు లోయర్ బెర్త్‌లను సినీయర్ సిటిజన్ కోటా కింద కేటాయిస్తారు. ఇక ఏసీ త్రీటైర్‌లో ఐదు, 2 టైర్‌లో 4 బెర్తులు వారికి కేటాయిస్తారు. వృద్దులు, గర్భిణులతో కలిసే ప్రయణించాలనుకుంటే వారిని ప్రత్యేకంగా టికెట్ బుక్ చేసుకుంటే లోయర్ బెర్త్‌లు కేటాయిస్తారు. ఒకే టికెట్‌పై అందరూ ప్రయాణించాలనుకుంటే జనరల్ కేటగిరీగా పరిగణించి లోయర్ బెర్త్ వచ్చే అవకాశం ఉండదు.

Follow Us