
Credit Card Tips: క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించడం ద్వారా మీరు మీ ఖర్చులను అవసరానికి తగ్గట్లుగా నిర్వహించగలుగుతారు. కానీ అదే సమయంలో, క్రెడిట్ కార్డ్ పొందడానికి అనేక పత్రాలు అవసరం అవుతాయి. ఇది అందరికీ సాధ్యం కాదు. క్రెడిట్ కార్డ్ పొందడానికి ఆదాయ రుజువు చాలా ముఖ్యమైన డాక్యూమెంట్. అలాంటి పరిస్థితిలో ఎవరికైనా ఆదాయ రుజువు లేకపోతే వారు క్రెడిట్ కార్డు ఎలా పొందగలరు. మీరు కూడా ఇదే సందిగ్ధంలో ఉన్నట్లయితే.. ఆదాయ రుజువు లేకుండా మీరు క్రెడిట్ కార్డ్‌ని ఎలా పొందవచ్చో ఇవాళ మనం తెలుసుకుందాం..
ఏదైనా క్రెడిట్ కార్డ్ జారీ చేసే బ్యాంకు క్రెడిట్ కార్డులు జారీ చేయబడిన వారికి నెలవారీ ఆదాయ పరిమితిని నిర్దేశిస్తుంది. మీరు పని చేసి, మీ ఆదాయం బ్యాంక్ నిర్ణయించిన ఆదాయ పరిమితి కంటే ఎక్కువగా ఉంటే, సులభంగా క్రెడిట్ కార్డ్‌ని పొందవచ్చు. సాధారణంగా, బ్యాంకులు ఈ మూల్యాంకనాన్ని నిర్వహిస్తాయి. తద్వారా క్రెడిట్ కార్డ్ తీసుకున్న వ్యక్తి ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించగలడా లేదా అని తెలుసుకోవచ్చు.
బ్యాంకు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక వ్యక్తికి ఆదాయ రుజువు లేకపోయినా, డాక్యూమెంట్స్ అందుబాటులో లేకపోయినా.. వారికి క్రెడిట్ కార్డ్ ఇవ్వవచ్చు అని అన్నారు. ఆదాయ రుజువు లేనట్లయితే, క్రెడిట్ కార్డ్ జారీ చేసే బ్యాంక్ సదరు వ్యక్తి వినియోగించిన డబ్బులను తిరిగి చెల్లింగల సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఇతర, ప్రత్యామ్నాయ ఆప్షన్స్ కోసం చూస్తుంది. బ్యాంకులు వ్యక్తి లోన్ అకౌంట్స్, క్రెడిట్ బ్యూరోల నుండి తిరిగి చెల్లింపు చరిత్ర, వ్యక్తి సంపద, సంబంధాల ఆధారంగా వాల్యుయేషన్ చేయవచ్చు.
అదే సమయంలో, ఒక కస్టమర్ క్రెడిట్ బ్యూరో ద్వారా పరీక్షించబడిన కస్టమర్ అయితే, అతని సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నట్లయితే.. ఇతర కార్డ్‌లు, లోన్‌లను తిరిగి చెల్లించడంలో మంచి ట్రాక్ రికార్డ్ కలిగి ఉంటే, అప్పుడు క్రెడిట్ కార్డ్ జారీ చేసే బ్యాంక్ అతనికి క్రెడిట్ కార్డ్‌ను సులభంగా జారీ చేస్తుంది. మొత్తంగా ఎవరికైతే కార్డు అవసరం ఉండి, ఆదాయ ధృవీకరణకు సంబంధించి డాక్యూమెంట్స్ లేవో అలాంటి వారి ట్రాక్ రికార్డ్ ఆధారంగా కార్డును జారీ చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..