Pensioners: పెన్షనర్లకి అలర్ట్‌.. ఈ రెండు విషయాలలో మార్పులు గమనించారా..!

|

Feb 24, 2022 | 11:38 AM

Pensioners Alert: మీ కుటుంబంలో పెన్షన్ తీసుకునే వ్యక్తులు ఉంటే రెండు ముఖ్యమైన వార్తలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో ఒకటి లైఫ్

Pensioners: పెన్షనర్లకి అలర్ట్‌.. ఈ రెండు విషయాలలో మార్పులు గమనించారా..!
Pensioners
Follow us on

Pensioners Alert: మీ కుటుంబంలో పెన్షన్ తీసుకునే వ్యక్తులు ఉంటే రెండు ముఖ్యమైన వార్తలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో ఒకటి లైఫ్ సర్టిఫికేట్ గురించి మరొకటి నేషనల్ పెన్షన్ సిస్టమ్ గురించి. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షనర్లకు పెద్ద ఊరటనిచ్చింది. పెన్షనర్లు ఇప్పుడు తమ సౌలభ్యం ప్రకారం సంవత్సరంలో ఏ సమయంలోనైనా లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చని EPFO తెలిపింది. అయితే దీని వ్యాలిడిటీ లైఫ్ సర్టిఫికెట్‌ సమర్పించిన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు ఉంటుంది. జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్‌ డిజిటల్‌గా రూపొందిస్తున్నారు. ఇది కాకుండా ప్రభుత్వ బ్యాంకులు, పోస్టాఫీసుల డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవల ద్వారా కూడా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. పెన్షనర్లు తమ డిజిటల్ జీవన్ ప్రమాణ్‌ను పెన్షన్ పేయింగ్ బ్యాంక్, పబ్లిక్ సర్వీస్ సెంటర్ (CSC), పోస్టాఫీస్, UMANG యాప్ లేదా వారి సమీపంలోని EPFO ​కార్యాలయంలో సమర్పించవచ్చు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌లో PPO నంబర్, ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్, ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్ ఉండాలి.

NPS లింక్‌డ్‌ సర్వీసెస్ ఫీజు పెంపు

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) నుంచి డబ్బును విత్‌ డ్రా చేయడానికి రుసుములను పెంచింది. ఇప్పుడు NPS నుంచి నిష్క్రమించినప్పుడు ప్రాసెసింగ్ రుసుము డిపాజిట్ చేసిన మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఇది గరిష్టంగా 0.125 శాతంగా నిర్ణయించారు. దీని కింద NPS హోల్డర్ నుంచి కనిష్టంగా రూ.125, గరిష్టంగా రూ. 500 వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ-ఎన్‌పీఎస్‌ కింద డిపాజిట్లపై చార్జీని 0.10 శాతం నుంచి 0.20 శాతానికి పెంచారు. ఇప్పుడు e-NPS ద్వారా డిపాజిట్లు కనీసం రూ.15 , గరిష్టంగా రూ.10,000 రుసుము చెల్లించవలసి ఉంటుంది. ఎన్‌పీఎస్‌లో నమోదుకు రూ.200 నుంచి 400 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రారంభ డిపాజిట్ మొత్తంపై 0.50 శాతం లేదా రూ. 30 నుంచి రూ. 25,000 వరకు వసూలు చేస్తారు. ఆర్థికేతర లావాదేవీలకు ప్రతిసారీ రూ.30 చార్జీ ఉంటుంది.

Jaggery: మహిళలకు గమనిక.. ఆ సమయంలో కచ్చితంగా బెల్లం తినాలి.. ఎందుకంటే..?

Breakup: లవ్‌లో ఫెయిల్‌ అయిన అబ్బాయిలు ఈ పనులే ఎక్కువగా చేస్తున్నారట..!

Mileage Bikes: సామాన్యుడి బతుకుబండి నడిపిస్తున్న 4 బైక్‌లు.. ధర తక్కువ మైలేజ్‌ ఎక్కువ..!