RBI: ఖాతాదారుల విషయంలో బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రోజుకు రూ.100 జరిమానా!

|

Jan 09, 2025 | 4:09 PM

RBI: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంటుంది. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఆర్బీఐ బ్యాంకులపై చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు మరోసారి బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల విషయంలో ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది..

RBI: ఖాతాదారుల విషయంలో బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రోజుకు రూ.100 జరిమానా!
Follow us on

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ ఖాతాదారుల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. కస్టమర్ ఫిర్యాదులను ఒక నెలలోపు పరిష్కరించాలి. ఆ లోపు సమస్య పరిష్కారం కాకపోతే రోజుకు రూ.100 జరిమానా విధిస్తామని ఆర్బీఐ బ్యాంకులకు కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ నియమం క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు కూడా వర్తిస్తుంది. ఈ పెనాల్టీ డబ్బు కస్టమర్‌కు పరిహారంగా ఇవ్వబడుతుంది. ఖాతాదారుల సమస్యలపై బ్యాంకులు త్వరగా స్పందించాలనే ఉద్దేశంతో ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది.

ఇది కాకుండా ఆర్‌బీఐ మరికొన్ని కీలక చర్యలు చేపట్టింది. Cbil, Experian మొదలైన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు (CICలు) ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ తమ ఖాతాదారుల క్రెడిట్ సమాచారాన్ని పొందినట్లయితే దాని గురించి వినియోగదారులకు ఇమెయిల్ లేదా SMS ద్వారా తెలియజేయాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశించింది.

బ్యాంకులు తమ ఖాతాదారులకు రుణం చెల్లించకుండా డిఫాల్ట్‌గా ఉంటే వారికి తెలియజేయాలి. దీన్ని 21 రోజుల్లోగా నివేదించకపోతే వినియోగదారునికి రోజుకు రూ.100 చొప్పున పరిహారం అందించాల్సి ఉంటుంది. CIC లేదా కస్టమర్ ఫిర్యాదు చేసిన 21 రోజులలోపు ఆర్థిక సంస్థలు రుణానికి సంబంధించిన తాజా సమాచారాన్ని CICకి అందించాలనే నియమం ఉంది. పాటించడంలో విఫలమైతే జరిమానాలు విధించవచ్చు.

భారతదేశంలో ప్రస్తుతం నాలుగు సీఐసీలు పనిచేస్తున్నాయి. CIBIL, CRIF, Equifax, Experian వంటి సంస్థలు ఉన్నాయి. ఈ సీఐసీలు, బ్యాంకులు తమ ఖాతాదారుల ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరించాలి. ఫిర్యాదుకు సంబంధించి తీసుకున్న చర్య గురించిన సమాచారాన్ని కస్టమర్‌కు అప్‌డేట్ చేయాలి. ఒకవేళ ఫిర్యాదు తిరస్కరణకు గురైతే అందుకు కారణం చెప్పాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

ఇది కూడా చదవండి: EPFO: మీ కంపెనీ పీఎఫ్‌ అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తుందా? లేదా? తెలుసుకోవడం ఎలా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి