Paytm: పేటీఎం వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. మొబైల్ బిల్లు చెల్లింపులపై రూ.500 వరకు రివార్డులు..

Paytm Users: పేటీఎం మొబైల్ బిల్లు చెల్లింపులపై క్యాష్‌బ్యాక్, ఇంకా రివార్డులను ప్రకటించింది. ప్రతి బిల్లు చెల్లింపులో వినియోగదారులు ఇప్పుడు రూ.500 వరకు గెలుచుకోవచ్చు.

Paytm: పేటీఎం వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. మొబైల్ బిల్లు చెల్లింపులపై రూ.500 వరకు రివార్డులు..
Paytm

Updated on: Sep 14, 2021 | 4:34 PM

Paytm Users: పేటీఎం మొబైల్ బిల్లు చెల్లింపులపై క్యాష్‌బ్యాక్, ఇంకా రివార్డులను ప్రకటించింది. ప్రతి బిల్లు చెల్లింపులో వినియోగదారులు ఇప్పుడు రూ.500 వరకు గెలుచుకోవచ్చు. కొన్నిసార్లు అగ్రశ్రేణి బ్రాండ్‌ల నుంచి అద్భుతమైన డీల్స్, గిఫ్ట్ వోచర్‌లను పొందుతున్నారు. ప్రతి బిల్ పేమెంట్‌పై కచ్చితంగా రూ.500 వరకు హామీ ఇచ్చే క్యాష్‌బ్యాక్‌ని కంపెనీ ప్రకటించింది. jio, Vi, Airtel, BSNL, MTNL నుంచి పోస్ట్‌పెయిడ్ సేవలకు సంబంధించిన అన్ని బిల్లు చెల్లింపులపై ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపుల కోసం రివార్డ్‌లను పొందడమే కాకుండా కంపెనీ రిఫరల్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం ద్వారా వినియోగదారులు అదనపు క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకోవచ్చు. అంతేకాదు వినియోగదారు Paytmతో రీఛార్జ్ చేయడానికి స్నేహితులు, కుటుంబ సభ్యులను ఆహ్వానించినప్పుడు ఇద్దరు రూ.100 వరకు క్యాష్‌బ్యాక్ పొందుతారు. Paytm తన వినియోగదారులకు Paytm UPI, Paytm Wallet, డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ వంటి ఇష్టమైన మోడ్‌ను ఎంచుకునే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. Paytm వినియోగదారులకు వారి తాజా బిల్లు, గడువు తేదీ గురించి కూడా గుర్తు చేస్తుంది.

ఈ సందర్భంగా Paytm ప్రతినిధి మాట్లాడుతూ “గత కొన్ని నెలలుగా మొబైల్ వినియోగదారులు తమ ఫోన్ బిల్లులను చెల్లించే విధానం మారిపోయిందన్నారు. చిన్న పట్టణాలు, నగరాలలోని అనేక మంది తమ వినియోగదారులు ఇప్పుడు పూర్తిగా బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్నారు. వీటిని మరింత పెంచడానికి వారికి 100 శాతం క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్లను అందించాలని నిర్ణయించాం. ఇది మా వినియోగదారులను మరింత ప్రోత్సహిస్తుంది” అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగం వదిలేశాడు.. సాగు బాట పట్టాడు.. ఇప్పుడు సంవత్సరానికి 40 లక్షలు సంపాదిస్తున్నాడు..

Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ వచ్చేస్తోంది.. వీటిపై 70 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్‌.!

TVS Fiero125: TVS పాత బైక్‌ ఇప్పుడు కొత్త మోడల్‌లో..! ధర ఎంతో తెలుసా..?