
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న చర్య చాలా మంది వ్యక్తుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే, కొన్ని నిబంధనలను పాటించనందున ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే . అంతేకాకుండా అనేక బలమైన కారణాలు ఆర్బీఐని ఈ విపరీతమైన చర్యకు నెట్టాయి. నిబంధనల ఉల్లంఘనను సరిచేయాలని పేటీఎం పేమెంట్ బ్యాంకుకు ఆర్బీఐ చాలాసార్లు చెబుతోంది. దీనిపై స్పందించకపోవడంతో నిషేధం విధించింది.
ఆర్‌బీఐ చర్యలకు కారణాలు:
కేవైసీ లాప్స్ అంటే ఏమిటి?
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సిస్టమ్ ఆడిట్‌ను ఆర్‌బీఐ నిర్వహించినప్పుడు చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్యంత ముఖ్యమైనది కేవైసీ రికార్డు సమస్య. క్లయింట్ల నుండి సరైన KYC పత్రాలు పొందకపోవడం. దీంతో అక్రమ నగదు బదిలీకి అవకాశం పెరుగుతుంది. బ్యాంక్‌లో లావాదేవీలు జరిగిన డబ్బు మూలాన్ని కనుగొనడం కష్టంగా మారుతుందని ఆర్బీఐ చెబుతున్న మాట. ఖాతాదారులను అడ్మిట్ చేసుకునే సమయంలో కేవైసీ డాక్యుమెంట్ల ద్వారా వారి బ్యాక్ గ్రౌండ్ ను చెక్ చేసే స్థాయికి వెళ్లలేదన్నది ఆర్బీఐ అభ్యంతరం.
సరైన KYC పత్రాలు లేకుండా మర్చంట్ ఖాతా ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు ఆడిటింగ్‌లో తేలింది. దీనిపై పలుమార్లు పేటీఎం బ్యాంకును ఆర్బీఐ హెచ్చరించింది. అయితే బ్యాంకు తీరును సరిదిద్దుకోలేదని చెబుతున్నారు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, పేటీఎం సిస్టర్ కంపెనీలు అయినప్పటికీ, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చట్ట ప్రకారం స్వతంత్రంగా పనిచేయాలి. ఏ బ్యాంకు అయినా స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి. అయితే, Paytm గ్రూప్, బ్యాంక్ మధ్య పరస్పర ఆధారపడటం, వ్యాపార సంబంధాలు చాలా లోతైనవి. పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ పేమెంట్స్ బ్యాంక్‌ను పరోక్షంగా నియంత్రించే అవకాశం ఉందని ఆర్బీఐకి తెలుస్తోంది. పేమెంట్స్ బ్యాంక్‌ను ఆర్‌బీఐ పతనానికి కూడా ఇదే కారణమని చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి