పేటీఎం పేమెంట్ బ్యాంక్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌

| Edited By:

Aug 24, 2020 | 1:47 PM

పేటీఎంకు చెందిన పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారులకు ఆ సంస్థ శుభవార్త అందించింది. పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఆధార్ ఆధారిత పేమెంట్ సర్వీసు

పేటీఎం పేమెంట్ బ్యాంక్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌
Follow us on

Paytm Payments Bank: పేటీఎంకు చెందిన పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారులకు ఆ సంస్థ శుభవార్త అందించింది. పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఆధార్ ఆధారిత పేమెంట్ సర్వీసు(ఏఈపీఎస్‌)ను పేటీఎం ఆవిష్కరించింది. దీని వలన ఆధార్ కార్డుల ద్వారా వినియోగదారులు బ్యాలెన్స్‌ డెబిట్‌, బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవచ్చు. ఇక త్వరలోనే బ్యాలెన్స్ డిపాజిట్‌, ఇంటర్‌బ్యాంక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి ఫీచర్లను లాంచ్ చేయాలని పేటీఎం ఆలోచనలో ఉంది. ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు ఎవరైనా ఏఈపీఎస్‌ సర్వీసులతో బ్యాంకింగ్ సేవలు పొందవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది.

దీని వలన బ్యాంకు శాఖలు, ఏటీఎంలు తక్కువగా ఉండే గ్రామీణ, సెమీ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని పేటీఎం వెల్లడించింది.  ఏఈపీఎస్ సర్వీసులతో  దేశంలో ఆర్థిక సేవలను వేగవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ సంస్థ తెలిపింది. దేశంలోని మారుమూల ప్రాంతంలోని ప్రజలు సైతం పూర్తి బ్యాంకింగ్ సేవలను పొందగలిగేలా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ సీఎండీ సతీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. ఇందు కోసం పది వేలకు పైగా వ్యాపార కరస్పాండెంట్లతో భాగస్వామ్యం కలిగి ఉన్నామన్నామని ఆయన వెల్లడించారు.

Read More:

ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది.. రైతులకు మంత్రి భరోసా

రానా ప్లేస్‌లోకి అల్లు అర్జున్‌!