పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్. పేటీఎం సరికొత్త ఫీచర్ను తీసుకువచ్చింది. తమ యూజర్లకు క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లించే అవకాశం కల్పిస్తుంది. ఇప్పటివరకు పేటీఎంలో మొబైల్ రీచార్జ్ చేయడం, పోస్ట్ పెయిడ్ బిల్స్ చెల్లించడం, ఎలక్ట్రిసిటీ బిల్స్ చెల్లించడం, గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం, రైలు టికెట్లు, బస్ టికెట్లు, ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
అద్దెకు ఉంటున్నవారు ఇక నుంచి ఇంటి అద్దెను నేరుగా యాజమాని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయ్యెచ్చు. ఇందుకు క్రెడిట్ కార్డును ఉపయోగించవచ్చు. ఈ పేమెంట్స్ చేస్తే రూ.1000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇలా ప్రతీ ట్రాన్సాక్షన్ పై క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుకోవచ్చు. అలాగే క్రెడిట్ కార్డ్ పాయింట్స్ కూడా లభిస్తాయి. ఇంటి అద్దె ఎలా చెల్లించాలో తెలుసుకుందాం.
➼ ముందుగా మీ పేటీఎం యాప్ ఓపెన్ చేయాలి.
➼ ఆ తర్వాత హోం స్క్రీన్ పై Recharge & Pay Bills పైన క్లిక్ చేయండి.
➼ అందులో Rent Payment ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
➼ అనంతరం Proceed ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
➼ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, అకౌంట్ హోల్డర్ పేరు ఎంటర్ చేయాలి.
➼ మొబైల్ నంబర్ ఎంటర్ చేయడం అనేది ఆప్షనల్.
➼ ఇవన్ని ఫిల్ చేసిన తర్వాత ప్రొసీడ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
➼ తర్వాత మీరు పంపాల్సిన అమౌంట్ ఎంటర్ చేయాలి.
➼ Proceed to pay పైన క్లిక్ చేయాలి.
➼ ఆ తర్వాత మీ క్రెడిట్ కార్డ్ సెలక్ట్ చేసి పేమెంట్ పూర్తి చేయాలి.
➼ అంతే మీరు కట్టాల్సిన అద్దె అమౌంట్ మీ ఓనర్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది.
Also Read: రైట్, రైట్.. డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి ఆర్టీసీ అద్దె బస్సులు