మన దేశంలో యూపీఐ ఆధారిత పేమెంట్లు అధికంగా జరగుతున్నాయి. వినియోగదారులు తమ ఫోన్ నుంచి క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా సులభంగా లావాదేవీలు చేసేస్తున్నారు. కరోనా అనంతరం పరిణామాల్లో ఈ వ్యవస్థ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అందులో పేటీఎం ప్రధాన పాత్ర పోషించింది. డిజిటల్ ఇండియా నినాదానికి ఆర్థిక లావాదేవీల పరంగా పేటీఎం తన వంతు పాత్రను సమర్థంగా పోషించింది. దీంతో మనం చేతుల్లో చిల్లిగవ్వ లేకపోయినా.. కేవలం ఫోన్ ఉండి.. దానిలో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్ ఉంటే చాలు ఎంచక్కా ఏది కావాలంటే అది కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకూ ఈ తరహా లావాదేవీలు చేయాలంటే కేవలం పలు యాప్ ల ద్వారా మాత్రమే సాధ్యమైంది. మీ బ్యాంకు అకౌంట్ ను పేటీఎం వంటి వాటితో అనుసంధానించి, ఖాతాలోని నగదును వాడుకోవచ్చు. అయితే ఇకపై మన కార్డు ఆధారిత పేమెంట్లు కూడా చేసే విధంగా పేటీఎం సరికొత్త విధానాన్ని ఆవిష్కరించింది. ఇందుకోసం పేటీఎం కార్డు సౌండ్ బాక్స్ ను లాంచ్ చేసింది. ఇప్పడు ఎంచక్కా ఏటీఎం కార్డుతోనే మీరు లావాదేవీ పూర్తి చేయచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
పేటీఎం తీసుకొచ్చిన ఈ కార్డు సౌండ్ బాక్స్ ద్వారా మీరు అన్ని ఏటీఎం కార్డులు అంటే వీసా, మాస్టర్ కార్డ్, రూపే కార్డులతో లావాదేవీలు చేయొచ్చు. క్యూఆర్ కోడ్ ఆధారిత మొబైల్ చెల్లింపులకు అదనంగా ఈ ఫీచర్ వినియోగదారులకు ఉపయోగపడనుంది. ట్యాప్ అండే పే విధానంలో వినియోగదారులు తమ కార్డును ఉపయోగించి పేమెంట్ పూర్తి చేయొచ్చు. ఇది యూజర్లతో పాటు వ్యాపారులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
పేటీఎం సౌండ్ బాక్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. వ్యాపారుల వద్ద మనం చేసిన లావాదేవి వివరాలు వాయిస్ నోటిఫికేషన్ రూపంలో అక్కడ వినిపిస్తుంది. మీరు చేసిన చెల్లింపు విజయవంతం అయితే పేటీఎం పేమెంట్ ఆఫ్ రూపీస్ 100 అంటూ వినిపించే వాయిస్ ఉంటుంది. దీంతో ఫోన్ ఓపెన్ చేసి నగదు చెల్లింపు జరిగిందా లేదా అని తనిఖీ చేసుకోవాల్సిన అసవరం ఉండదు. ఇది సమయాన్ని ఆదా చేస్తుంది. వ్యాపారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 2019లోనే పేటీఎం ఈ సౌండ్ బాక్స్ ను తీసుకొచ్చింది. మన దేశంలో మొట్టమొదటిగా ఇలా ఆడియో నోటిఫికేషన్ వ్యవస్థను తీసుకొచ్చింది పేటీఎం సంస్థే.
పేటీఎం ప్రవేశపెట్టిన ఈ కొత్త కార్డు సౌండ్ బాక్స్ ద్వారా మీరు గరిష్టంగా రూ. 5000 వరకూ పేమెంట్ చేయొచ్చు. మీరు కార్డును ఆ సౌండ్ బాక్స్ వద్ద ఉంచగానే ఆటోమేటిక్ గా పేమెంట్ మొదలవుతుంది. పేమెంట్ పూర్తయిన వెంటనే ఆడియో ద్వారా నోటిఫికేషన్, అలాగే ఎల్సీడీ స్క్రీన్ లో విజువల్ కన్ఫర్మేషన్ వస్తుంది. ఈ సౌండ్ బాక్స్ లు మన దేశంలోనే పేటీఎం తయారు చేసింది. 4జీ నెట్ వర్క్ కనెక్టివిటీతో ఇది పనిచేస్తుంది. దీనిలో బ్యాటరీ 4వాట్స్ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ 5 రోజుల పాటు పనిచేస్తుంది. ఈ బాక్స్ 11 భాషలను సపోర్టు చేస్తుంది. వ్యాపారులు పేటీఎం ఫర్ బిజినెస్ అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని దీనిని ఉపయోగించుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..