Paytm:సెబీ నోటీసు ఇష్యూపై పేటీఎం కీలక ప్రకటన.. విషయం పాతదే అని వెల్లడి

|

Aug 30, 2024 | 12:48 PM

తన IPOకి సంబంధించి SEBI నుండి నోటీసు అందుకున్న వార్తలపై పేటీఎం స్పందించింది. మీడియాల్లో ఇప్పుడు వచ్చింది కొత్త విషయం ఏం కాదని.. తాము గతంలోనే ఈ విషయం గురించి వెల్లడించినట్లు తెలిపింది. ఇదే విషయమై సెబీతో కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ.. అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

Paytm:సెబీ నోటీసు ఇష్యూపై పేటీఎం కీలక ప్రకటన.. విషయం పాతదే అని వెల్లడి
Vijay Shekhar Sharma
Follow us on

మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI నుండి కొత్త నోటీసు అందిందని మీడియాలో సర్కులేట్ అవుతున్న కథనాలను ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం కంపెనీ ఖండించింది. సెబీ నుంచి ఎలాంటి కొత్త నోటీసులు అందలేదని స్పష్టం చేసింది. మీడియాల్లో ఇప్పుడు వచ్చింది కొత్త విషయం ఏం కాదని.. తాము గతంలోనే ఈ విషయం గురించి వెల్లడించినట్లు తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరం ఫలితాల సందర్భంగా.. మరోసారి ఇటీవల జూన్‌తో ముగిసిన త్రైమాసికం ఫలితాల సందర్భంగానే దీని గురించి ప్రస్తావించినట్లు వివరించింది. ఇదే విషయమై సెబీతో కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ.. అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

తాము రూల్స్‌కు అనుగుణంగానే వెళ్తున్నామని.. మార్చి త్రైమాసికం సహా జూన్ త్రైమాసిక ఫలితాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపబోదని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. సెబీకి సంబంధించిన నోటీసుపై తాము చురుకుగా పని చేస్తున్నామని కంపెనీ తెలిపింది. ఈ విషయంలో తగిన న్యాయ సలహా తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలు తీసుకోబోతున్నట్లు వివరణ ఇచ్చింది.  సెబీ ఆదేశాల్ని పాటించేందుకు, పారదర్శకమైన సర్వీసులు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు పేటీఎం తెలిపింది.  SEBI అన్ని  నియమాలు, నిబంధనలను పేటీఎం పూర్తిగా అనుసరిస్తుందని కంపెనీ ఆడిట్ నివేదికలో కూడా పేర్కొంది.

పేటీఎం దేశంలోని అతిపెద్ద ఫిన్‌టెక్ కంపెనీలలో ఒకటి. కంపెనీ తన IPOను 2021లో ప్రారంభించింది, ఆ సమయంలో రూ. 18,300 కోట్లతో దేశంలోనే అతిపెద్దదిగా అవతరించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..