పేటీఎం వినియోగదారులకు శుభవార్త. పేటీఎం ద్వారా చెల్లింపులు చేసిన కస్టమర్లకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తోంది ఈ పేమెంట్ సంస్థ. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు ఏకంగా 14000 క్యాష్‌బ్యాక్ పాయింట్లను పొందవచ్చు. ఇక పేటీఎం.. తన వినియోగదారుల కోసం ఈ బంపర్ ఆఫర్‌ను ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభమయింది. ఈ మేరకు పేటీఎం సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ కూడా చేసింది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా పేటీఎం ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో పేటీఎం తెలిపిన వివరాల ప్రకారం.. పేటీఎం చెల్లింపులు చేయడం ద్వారా మూడు చొప్పున మూడు రకాల కార్డులను అందుతాయి. లవ్ అండ్ ఎఫెక్షన్, ఎంటర్టైన్మెంట్, డిన్నర్ కార్డ్ పేరుతో ఉన్న ఈ తొమ్మిది కార్డ్‌లను సేకరించిన తర్వాత, వినియోగదారులు రూ. 140 విలువైన 14,000 పేటీఎం క్యాష్‌బ్యాక్ పాయింట్లను పొందుతారు.
అయితే ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఈ నెల 14 నుంచి 20 వరకు.. అంటే వారం రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఈ కార్డ్‌లను పొందాలంటే పేటీఎంలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా వినియోగదారులు డబ్బులు స్వీకరించినా, డబ్బును బదిలీ చేసినా, మొబైల్ రీఛార్జ్, యుటిలిటీ బిల్లులు చెల్లించినప్పుడు పాయింట్లను సంపాదించవచ్చు. ఈ సంగతి దాదాపుగా అందరికీ తెలిసిందే.
This Valentine’s, win over love & cashback with #PaytmValentinesCashback!?
Send money, recharge, pay bills & more to collect cards & win up to 14000 Cashback points!*
Play now to win: https://t.co/fE1siDe2Ko
*Offer ends on 20th February 2023 #PaytmSeUPI— Paytm (@Paytm) February 13, 2023
మరిన్ని బిజినెస్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..