Passenger Vehicle: కొనసాగుతున్న ఆటో సంక్షోభం.. తగ్గిన వాహనాల అమ్మకాలు..!

|

Apr 06, 2022 | 4:14 AM

Passenger Vehicle: ఆటో రంగం ప్రస్తుతం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. చిప్ సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. ఇది కాకుండా చైనాలో కొత్త లాక్‌డౌన్ విధించడం వల్ల సరఫరా సమస్య..

Passenger Vehicle: కొనసాగుతున్న ఆటో సంక్షోభం.. తగ్గిన వాహనాల అమ్మకాలు..!
Follow us on

Passenger Vehicle: ఆటో రంగం ప్రస్తుతం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. చిప్ సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. ఇది కాకుండా చైనాలో కొత్త లాక్‌డౌన్ విధించడం వల్ల సరఫరా సమస్య మళ్లీ పెరిగింది. ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ FADA తాజా నివేదిక ప్రకారం.. మార్చి నెలలో దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 4.87 శాతం క్షీణించాయి . దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు మార్చి నెలలో 2 లక్షల 71 వేల 358 యూనిట్లుగా ఉన్నాయి. మార్చి 2021లో ప్యాసింజర్ వాహన విక్రయాలు 2 లక్షల 85 వేల 240 యూనిట్లుగా ఉన్నాయి. FADA ప్రెసిడెంట్ వింకేష్ గులాటి మాట్లాడుతూ .. సరఫరా పరిస్థితి కొద్దిగా మెరుగుపడిందని, అయితే ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్‌లో డిమాండ్ కొనసాగుతుందని, వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ కాలం ఉంటుందని అన్నారు. ఇప్పటికీ సెమీకండక్టర్ (Semiconductor crisis) సంక్షోభం పెద్ద సమస్యగా మారింది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనాలో లాక్‌డౌన్ కారణంగా సరఫరాలను మరింత తగ్గిస్తుందని ఆయన అన్నారు. దీంతో పాటు వాహనాల సరఫరాపైనా ప్రభావం పడనుంది. మార్చి నెలలో ద్విచక్ర వాహనాల విక్రయాలు 4.02 శాతం క్షీణించి 11 లక్షల 57 వేల 681 యూనిట్లుగా ఉన్నాయి. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 12 లక్షల 6 వేల 191 యూనిట్లుగా ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని, దీని వల్ల ద్విచక్ర వాహనాల విక్రయాలు ప్రభావం చూపుతున్నాయని గులాటీ అన్నారు. వాహనాల ధరల పెరుగుదల, పెట్రోలు ధరల పెరుగుదలతో ఈ సెంటిమెంట్ మరింత దెబ్బతింది.

వాణిజ్య వాహనాల విక్రయాలు 15% వృద్ధి:

మార్చి నెలలో వాణిజ్య వాహనాల విక్రయాలు 14.91 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మార్చిలో మొత్తం 77 వేల 938 యూనిట్ల వాణిజ్య వాహనాలు విక్రయించబడ్డాయి. మార్చి 2021లో మొత్తం 67 వేల 828 యూనిట్ల వాణిజ్య వాహనాలు విక్రయించబడ్డాయి.

త్రీవీలర్ల అమ్మకాలు 27% పెరిగాయి:

త్రీ వీలర్ల విక్రయాలు కూడా 26.61 శాతం వృద్ధిని నమోదు చేసి మొత్తం విక్రయాలు 48 వేల 284 యూనిట్లుగా నమోదయ్యాయి. మార్చి 2021లో 38 వేల 135 యూనిట్ల త్రీ వీలర్లు అమ్ముడయ్యాయి. మొత్తంగా మార్చిలో అన్ని వాహనాల విక్రయాల్లో 2.87 శాతం క్షీణత నమోదైంది. మార్చిలో మొత్తం వాహనాల విక్రయాలు 16 లక్షల 19 వేల 181 యూనిట్లుగా నమోదయ్యాయి. మార్చి 2021లో మొత్తం 16 లక్షల 66 వేల 996 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి.

ఫిబ్రవరిలో అమ్మకాలు 6.3 శాతం తగ్గాయి:

ఫిబ్రవరిలో వాహనాల మొత్తం అమ్మకాలు 17.8 శాతం క్షీణించాయి. అలాగే మొత్తం 17.91 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఫిబ్రవరి 2021లో మొత్తం 21.77 లక్షల యూనిట్ల వాహనాలు విక్రయించబడ్డాయి. ప్యాసింజర్ కార్ల విక్రయాలు ఫిబ్రవరిలో 6.3 శాతం క్షీణించి 1.67 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. సరిగ్గా ఏడాది క్రితం 1.78 లక్షల యూనిట్ల ప్యాసింజర్ కార్లు అమ్ముడయ్యాయి. ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో 0.8 శాతం క్షీణత నమోదు కాగా, మొత్తం 3.14 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి.

ఇవి కూడా చదవండి:

Saving: కేవలం రూ.1000 సేవ్ చేస్తే అంత లాభమా.. మంచి రాబడికోసం ఇలా ఇన్వెస్ట్ చేయండి..

EV Trucks: దేశంలో ఇక ఇప్పుడు ఎలక్ట్రిక్ ట్రక్కులు.. పూర్తి స్వదేశీ పరికరాలతో తయారీ.. వివరాలు..