Parliament Budget Session: రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యావాద తీర్మానం.. కాంగ్రెస్‌ను చీల్చి చెండాడిన మోదీ

|

Feb 06, 2025 | 5:01 PM

PM Narendra Modi: దివ్యాంగుల సంక్షేమం కోసం తాము ఒక ప్రణాళికను రూపొందించడమే కాకుండా దానిని క్షేత్రస్థాయిలో కూడా అమలు చేశామని ప్రధాని మోదీ అన్నారు. లింగమార్పిడి సమాజం హక్కులకు సంబంధించి, దానికి చట్టపరమైన రూపం ఇవ్వడానికి ప్రయత్నించామని వివరించారు. భారతదేశ అభివృద్ధి..

Parliament Budget Session: రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యావాద తీర్మానం.. కాంగ్రెస్‌ను చీల్చి చెండాడిన మోదీ
Follow us on

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యావాద తీర్మానంలో మాట్లాడారు ప్రధాని మోదీ మాట్లాడారు. కాంగ్రెస్‌ను మోదీ చీల్చి చెండాడారు. రిజర్వేషన్ల పేరుతో దేశ ప్రజలను మళ్లీ విభజించేందుకు కాంగ్రెస్‌ కుట్ర చేస్తోందన్నారు. ఎలాంటి గొడవలు లేకుండా దేశం లోని పేదలకు తమ ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు మోదీ. రాజ్యాంగ నిర్మాల అంబేద్కర్‌ను కాంగ్రెస్‌ నేతలు జీవితాంతం అవమానించారని అన్నారు ప్రధాని మోదీ. అంబేద్కర్‌ పేరు వింటే కాంగ్రెస్‌ నేతలకు చిరాకని , అందుకే ఆయనకు భారతరత్న ఇవ్వలేదన్నారు. ఇప్పుడు జై భీమ్‌ నినాదాలతో కపటనాటకాలు ఆడుతున్నారని అన్నారు.

కాంగ్రెస్ నుంచి సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ ఆశించడం పెద్ద తప్పు అని, ఎందుకంటే ఇది వారి ఆలోచన, అవగాహనకు మించినదని మోదీ అన్నారు. కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీ ఒక కుటుంబానికి అంకితం అయిందని, అటువంటి పరిస్థితిలో అందరి మద్దతు, అందరి అభివృద్ధి సాధ్యం కాదన్నారు. బీజేపీకి మొదటి ప్రాధాన్యత దేశమేనని, దేశ ప్రజలు మూడోసారి తమకు అవకాశం ఇచ్చారన్నారు.

తమకు దేశమే అన్నింటికన్నా ముఖ్యం అని అన్నారు. మా విధానాలు, కార్యక్రమాలలో నిరంతరం దేశానికి సేవ చేయడానికి ప్రయత్నించామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో ప్రతిదానిలోనూ బుజ్జగింపు ఉండేదని, ప్రతిదానిలోనూ బుజ్జగింపు రాజకీయాలు ఉన్నాయని విమర్శించారు.

మా ప్రభుత్వం ఎస్సీ-ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేయడం ద్వారా దళిత, గిరిజన సమాజ గౌరవం, భద్రత పట్ల తన నిబద్ధతను ప్రదర్శించిందన్నారు. నేడు, కులతత్వ విషాన్ని వ్యాప్తి చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని, మూడు దశాబ్దాలుగా ఉభయ సభలకు చెందిన OBC ఎంపీలు OBC కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇవ్వాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూనే ఉన్నారన్నారని, కానీ అది తిరస్కరణకు గురవుతుందన్నారు.

దివ్యాంగుల సంక్షేమం కోసం తాము ఒక ప్రణాళికను రూపొందించడమే కాకుండా దానిని క్షేత్రస్థాయిలో కూడా అమలు చేశామని ప్రధాని మోదీ అన్నారు. లింగమార్పిడి సమాజం హక్కులకు సంబంధించి, దానికి చట్టపరమైన రూపం ఇవ్వడానికి ప్రయత్నించామని వివరించారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో మహిళా శక్తి సహకారాన్ని ఎవరూ కాదనలేరన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి