
డాలర్‌తో పోలిస్తే భారతదేశ రూపాయి మారకం విలువ చారిత్రాత్మకంగా పడిపోతూ ఇప్పుడు 2025లో రికార్డు స్థాయిలో బలపడుతోంది. కానీ పొరుగు దేశం పాకిస్తాన్ కరెన్సీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ రోజే కాదు. గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ రూపాయి గణనీయంగా బలహీనపడింది. ముఖ్యంగా పాకిస్తాన్ కరెన్సీ నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్ వంటి ఆసియా దేశాల కరెన్సీల కంటే పడిపోయింది. ఏప్రిల్ 2025 తాజా డేటా ప్రకారం యూఎస్ డాలర్‌తో పాకిస్థాన్ కరెన్సీ 280 రూపాయలుగా ఉంది. అదే నేపాలీస్ రూపాయలు అయితే 132, ఆఫ్ఘనిస్థాన్ అయితే 87, భూటాన్ కరెన్సీ విలువ 83, బంగ్లాదేశ్ 117 టాకాలతో పాకిస్థాన్ కంటే మెరుగ్గా ఉంది.
1 నేపాలీ రూపాయి అంటే దాదాపు 2.12 పాకిస్తానీ రూపాయలకు సమానం. 1 ఆఫ్ఘని అంటే దాదాపు 3.21 పాకిస్తానీ రూపాయలు. 1 భూటానీస్ లెంట్రమ్ దాదాపు 3.37 పాకిస్తానీ రూపాయలు. 1 బంగ్లాదేశ్ టాకా అంటే దాదాపు 2.39 పాకిస్తానీ రూపాయలు. కాబట్టి మారకం రేటు పరంగా చూస్తే ఈ నాలుగు దేశాల కరెన్సీల కంటే పాకిస్తాన్ రూపాయి బలహీనంగా మారింది.