Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zomato: జొమాటో యాప్‌లో కొత్త అప్‌డేట్‌.. అదరిపోయే బుక్కింగ్ ఫీచర్ తీసుకొచ్చిన కంపెనీ..

జొమాటోలో మీరు ఇప్పుడు ఒకేసారి అనేక రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. ఇప్పటి వరకు ఈ పని చేయడానికి.. ప్రతి ఆర్డర్‌ను విడిగా ఆర్డర్ చెల్లించాల్సి వచ్చేది. అయితే జొమాటో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదేంటో.. ఎలా బుక్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Zomato: జొమాటో యాప్‌లో కొత్త అప్‌డేట్‌.. అదరిపోయే బుక్కింగ్ ఫీచర్ తీసుకొచ్చిన కంపెనీ..
Biryani
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 30, 2023 | 6:24 PM

ఆకలి వేస్తోందా ఫోన్ తీయాలి క్లిక్ చేయాలి. అంతే, కొద్ది సేపట్లో డోర్ బెల్ మొగుతుంది. తెచ్చింది హాయిగా తినేస్తున్నాం. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఇంట్లో వండి, వార్చేవారి సంఖ్య మెట్రో నగరాల్లోచాలా తగ్గిపోయిందని తాజా సర్వేలు చెబతున్నాయి. అమ్మా..! ఆకలి వేస్తోంది అనేవారి కంటే జొమాటో, స్విగ్గీలో కాస్తా బుక్ చేస్తారా అనే పరిస్తితి నెలకొంది. ఈ పరిస్థితి చిన్న నగరాల్లో పూర్తిగా రాకున్నా.. వంట చేయాలని అనిపించకపోతే.. శనివారం, ఆదివారాల్లో మాత్రం జొమాటో లేదా స్విగ్గీ వైపు చేస్తున్నారు. ఈ ఫుడ్ డెలివరీ యాప్‌లు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. మీరు వాటిని ప్రత్యేకంగా మహిళల ఫోన్‌లలో ఖచ్చితంగా చూడవచ్చు. మీరు కూడా అప్పుడప్పడు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నట్లైతే మీరు అదిరిపోయే న్యూస్ అని చెప్పవచ్చు.

చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ ఆర్డర్ చేయాలంటే ఒక్కొక్కటిగా ఆర్డర్ చేయాల్సి వచ్చేంది.. ఇప్పుడు ఆ సమస్యకు చెక్ పట్టింది జొమాటో. ఒకే సమయంలో 4 వేర్వేరు రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు.  ఈ సరికొత్త ఆర్డర్ చేసుకునే అవకాశాన్ని యాప్‌లో అప్‌డేట్ చేసింది కంపెనీ.

4 వేర్వేరు కార్ట్‌లను..

మన ఇంట్లో ఒకరు వెజ్ ఇష్టపడితే మరికొందరు చికెన్ బిర్యానీ ఇష్టం తింటారు. ఈ రెండు ఒకే రెస్టారెంట్‌లో లభించకపోవచ్చు. మరికొన్నిసార్లు మనం చూస్తున్న రెస్టారెంట్‌లో అనుకున్న ఫుడ్ లేదని చాలాసార్లు మెసెజ్ వస్తుంతుంటుంది. ఇలాంటి సమయంలో మనం మళ్లీ ఆర్డర్ చేయాలి. అదే సమయంలో జొమాటోలో ఈ పని చేయడం సాధ్యపడదు. ఇది చాలాసార్లు చికాకు కలిగించే సమస్య. ఇప్పుడు కంపెనీ ఒక పరిష్కారంతో ముందుకు వచ్చింది. ఇప్పుడు మీరు నాలుగు వేర్వేరు కార్ట్‌లలో ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. అంటే ఒక్కో కార్ట్‌లో వేర్వేరు రెస్టారెంట్లను ఎంచుకోవచ్చు. అన్ని కార్ట్‌లలో ఏదైనా లేదా మరొకటి ఆర్డర్ చేసిన తర్వాత, మీరు ఒకేసారి చెల్లించి ఆర్డర్‌ని ఖరారు చేయవచ్చు. ఆహారాన్ని ఆర్డర్ చేసిన తర్వాత.. ఇప్పుడు అన్ని ఆర్డర్‌లను విడిగా ట్రాక్ చేయవచ్చు.

జొమాటో, స్విగ్గీ మధ్య గట్టి పోటీ

ఇండియన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లో జొమాటో, స్విగ్గీ మధ్య భారీ పోటీ నడుస్తోంది. ముఖ్యంగా ఈ రెండు ఫుడ్ డెలివరీ యాప్స్ ఒకరి తర్వాత ఒకరు కొత్త ఫీచర్లను పరిచయం తేస్తున్నారు. ఈ రెండు సంస్థల మార్కెట్ విలువ సుమారు $5 బిలియన్లు. ప్రస్తుతం జొమాటో వాటా 55 శాతం కాగా, స్విగ్గీ వాటా 45 శాతం. 2020లో స్విగ్గీ 52 శాతంతో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. గత మూడు సంవత్సరాలలో స్విగ్గీ మార్కెట్ వాటా నిరంతరం క్షీణించడం కనిపించింది.  2023లో స్విగ్గీ ఆదాయం $600 మిలియన్ల నుంచి సుమారు $900 మిలియన్లకు పెరిగినప్పటికీ.. ఇప్పటికీ ఈ కంపెనీ నష్టాలు ఎక్కువగానే ఉన్నాయి. అదే సమయంలో స్విగ్గి నష్టం దాదాపు $545 మిలియన్లు కాగా, జొమాటో నష్టం దాదాపు $110 మిలియన్లు. రెండు కంపెనీల మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది. రెండూ తమ కస్టమర్లను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లను తెస్తూనే ఉంటాయి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం