Oneplus: కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌.. వన్‌ప్లస్‌ నుంచి స్మార్ట్‌ఫోన్స్‌, టీవీలపై భారీ డిస్కౌంట్‌..!

Oneplus: పండగ సీజన్‌ వస్తున్న తరుణంలో స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు వినియోగదారులకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ..

Oneplus: కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌.. వన్‌ప్లస్‌ నుంచి స్మార్ట్‌ఫోన్స్‌, టీవీలపై భారీ డిస్కౌంట్‌..!

Edited By:

Updated on: Oct 03, 2021 | 8:05 AM

Oneplus: పండగ సీజన్‌ వస్తున్న తరుణంలో స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు వినియోగదారులకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వన్‌ప్లస్‌ కొనుగోలుదారులకు దీపావళి సేల్‌ను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్స్‌, టీవీల కొనుగోలుపై భారీ డీల్స్‌ను, ఆఫర్లను కొనుగోలుదారులకు అందుబాటులో తీసుకవచ్చింది. వన్‌ప్లస్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో దీపావళి సేల్‌ను నిర్వహిస్తోంది. వన్‌ప్లస్ 9 ప్రో , వన్‌ప్లస్ 9 ఆర్‌తో సహా , వన్‌ప్లస్ 9 శ్రేణిపై భారీ తగ్గింపును అందిస్తోంది. అదనంగా, వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌పై కూడా డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను ప్రకటించింది. తొమ్మిది నెలల వరకు నోకాస్ట్‌ ఈఎమ్‌ఐ సదుపాయాన్ని కూడా వన్‌ప్లస్‌ అందించనుంది.

వన్‌ప్లస్‌ 9ఆర్‌, వన్‌ప్లస్‌ 9 స్మార్ట్‌ఫోన్లపై రూ. 3000 తగ్గింపును ప్రకటించింది. దీంతో వన్‌ప్లస్‌ 9ఆర్‌ ధర రూ. 36,999, కాగా వన్‌ప్లస్‌ 9 రూ. 46,999 అందుబాటులో ఉంది. వన్‌ప్లస్‌ 9 ప్రోపై 4వేల తగ్గింపుతో రూ. 60,999 లభించనుంది. అమెజాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో సుమారు 7 వేల తగ్గింపు ధరను అందిస్తోంది. అక్టోబర్‌ 4 నుంచి వన్‌ప్లస్‌ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఎస్బీఐ కార్డులపై కూడా 7 వేల తగ్గింపు అందిస్తోంది

వన్‌ప్లస్ స్మార్ట్‌ టీవీలు..

కాగా, వన్‌ప్లస్‌ స్మార్ట్‌టీవీ వై, యూ సిరీస్‌ శ్రేణి టీవీలపై 15 శాతం తగ్గింపును అందిస్తోంది. వన్‌ప్లస్‌ వై సిరీస్‌ 32-అంగుళాల టీవీ కొనుగోలుదారులకు రూ. 15,999కు లభించనుంది. అంతేకాకుండా అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై తక్షణ తగ్గింపు రూ. 2000 ను అందించనుంది. వన్‌ప్లస్‌ యూ సిరీస్‌ 50-అంగుళాల స్మార్ట్‌టీవీ రూ. 43,999 లభిస్తోంది. ఐసీఐసీఐ కార్డులపై అదనంగా రూ. 3 వేల తక్షణ తగ్గింపు అందుబాటులోకి రానుంది.

ఇవీ కూడా చదవండి:

Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో రూ.50 వేలు డిపాజిట్‌ చేస్తే.. రూ.3,300 పెన్షన్‌..!

Online Shopping: మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నారా..? ఇలాంటి జాగ్రత్తలు పాటించడం మంచిది..!

Aadhaar: ప్రజలకు శుభవార్త.. భారీగా ఆధార్‌ అథెంటికేషన్‌ ఛార్జీల తగ్గింపు.. ఎంత అంటే..!

Loading...
Unable to load recommendations.
Follow Us