
OnePlus Not Shutting Down: గత కొన్ని రోజులుగా వన్‌ప్లస్‌కు సంబంధించిన అంశాలు ఇంటర్నెట్‌లో చాలా చర్చనీయాంశాలుగా మారాయి. భారతదేశంలో తన కార్యకలాపాలను మూసివేస్తున్నారనే వార్తలను వన్‌ప్లస్ అధికారికంగా తోసిపుచ్చింది. ఈ వాదనలలో ఎలాంటి లేదని పేర్కొంది. జనవరి 21 విడుదల చేసిన ఒక ప్రకటనలో దేశంలో తన వ్యాపార విధులు ప్రభావితం కాలేదని, అలాగే యథావిధిగా కొనసాగుతున్నాయని కంపెనీ పునరుద్ఘాటించింది. భారత మార్కెట్ నుండి బ్రాండ్ నిష్క్రమించే అవకాశం గురించి సోషల్ మీడియా ఊహాగానాల వస్తుండటంతో ఈ క్లారిటీ ఇచ్చింది.
వన్‌ప్లస్ ఇండియా CEO రాబిన్ లియు, X (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ ద్వారా తప్పుడు సమాచారాన్ని నేరుగా ప్రస్తావించారు. కంపెనీ సాధారణంగానే పనిచేస్తోందని ఆయన అన్నారు. “వన్‌ప్లస్ ఇండియా, దాని కార్యకలాపాల గురించి వ్యాపించిన కొన్ని తప్పుడు సమాచారాన్ని నేను పరిష్కరించాలనుకున్నాను. మేము యథావిధిగా పనిచేస్తున్నాము.. ఎప్పుడు కూడా అలానే కొనసాగిస్తాము అని అన్నారు.
ఇది కూడా చదవండి: Gratuity Calculator: గ్రాట్యుటీ అంటే ఏంటి? రూ.30 వేల జీతం ఉంటే ఎన్నేళ్లకు ఎంత వస్తుంది? ఇలా లెక్కించండి!
OnePlus ఇండియా CEO రాబిన్ లియు కూడా కస్టమర్లు, భాగస్వాములు, వాటాదారులు ఖచ్చితమైన సమాచారం కోసం అధికారిక కమ్యూనికేషన్ మార్గాలపై మాత్రమే ఆధారపడాలని కోరారు. అనవసరమైన ఆందోళన కలిగించే ఆధారాలు లేని వాదనలను పంచుకునే ముందు అన్ని వాటాదారులు అధికారిక సైట్ల నుండి వివరాలను ధృవీకరించాలని కంపెనీ సూచించింది.
నివేదికల ప్రకారం.. ఓప్పో కంపెనీలో వన్‌ప్లస్ బ్రాండ్ విలీనం జరుగుతోంది. వన్‌ప్లస్‌లోని చాలా కీలక విభాగాలను ఓప్పో నియంత్రిస్తోంది. ప్రొడక్ట్ స్ట్రాటజీ, ఆర్‌అండ్‌డి, మార్కెటింగ్ నిర్ణయాలు ఓప్పో చేతిలో ఉన్నాయి. ఈ కారణాలతో వన్‌ప్లస్ స్వతంత్ర బ్రాండ్‌గా ఇప్పుడు స్వేచ్ఛ తగ్గింది. వన్‌ప్లస్‌కు చెందిన చాలా టీమ్స్ ఇప్పుడు ఓప్పో మేనేజ్‌మెంట్ కింద పనిచేస్తున్నాయి.
I wanted to address some misinformation that has been circulating about OnePlus India and its operations.
We’re operating as usual and will continue to do so.
Never Settle. pic.twitter.com/eAGA7iy3Xs— Robin Liu (@RobinLiuOnePlus) January 21, 2026
ప్రపంచ స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో గణనీయమైన వ్యూహాత్మక మార్పులు జరుగుతున్న సమయంలో ఇటీవలి స్పష్టత వచ్చింది. OnePlus 2013లో స్వతంత్ర సంస్థగా స్థాపించినప్పటికీ, ఇది చారిత్రాత్మకంగా బీబీకే ఎలక్ట్రానిక్స్ కింద భాగస్వామ్య సరఫరాలు, పెట్టుబడిదారుల ద్వారా OPPOతో లోతైన సంబంధాలను కొనసాగించింది. భారతదేశంలో OnePlus ఇప్పుడు విస్తృత OPPO పర్యావరణ వ్యవస్థలో ఒక ప్రత్యేక బ్రాండ్‌గా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఓప్పోలో వన్‌ప్లస్ విలీనం విషయం తెలిసి వారంటీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ గురించి చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి ఉన్న యూజర్లకు ఎలాంటి రిస్క్ లేదు. వారంటీ, ఆఫ్టర్-సేల్స్ సర్వీసెస్ కొనసాగుతాయి. ఎక్సిస్టింగ్ డివైసెస్‌కు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వస్తాయి. కొత్త వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు ఇప్పటికీ డెవలప్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Silver: సిల్వర్ మాయాజాలం.. 20 రోజుల్లోనే ధనవంతులను చేసిన వెండి!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి