కొత్త సంవత్సరంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కోనాలనుకుంటున్నారా..? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ నుంచి కొత్త OnePlus 11 5G ఫ్లాగ్‌షిప్ ఫోన్ రాబోతోంది. ఫిబ్రవరి 7న భారత మార్కెట్‌లో లాంచ్ కానున్న ఈ స్మార్ట్‌ఫోన్.. అదే రోజున ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు ప్లాట్‌ఫారమ్‌లో టీజర్ ఫొటోను రివీల్ చేసింది అమెజాన్. ఇది రాబోయే ఫోన్ ముందస్తు ఆర్డర్ తేదీని సూచిస్తుంది. ధర ఎంత అనేది ఇంకా తెలియనప్పటికీ.. ఫిబ్రవరి 7న అధికారికంగా ప్రకటించనుంది వన్‌ప్లస్ కంపెనీ. OnePlus 11 5G ధర రూ. 60వేల లోపు ఉంటుందని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ట్విట్టర్‌లో సూచించారు.
ప్రాథమిక సమాచరం ప్రకారం.. 16GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ. 61,999గా ఉండవచ్చు. OnePlus 11 నాలుగు ఏళ్ల ప్రధాన Android OS అప్‌గ్రేడ్‌లతో పాటు 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది. ఈ కొత్త ఫోన్ కోసం 4 జనరేషన్ల ఆక్సిజన్ OS అప్‌డేట్‌లను అందజేస్తామని కంపెనీ చెబుతోంది. ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. కంపెనీ ఇప్పటికే చైనాలో OnePlus 11ని ప్రకటించింది. ఈ టీజర్‌ల ద్వారా కొన్ని ఫీచర్లను కూడా ధృవీకరించింది. కొత్త 5G OnePlus ఫోన్ స్పెసిఫికేషన్‌లు చైనీస్ మోడల్‌ను పోలి ఉంటాయని వెల్లడిస్తున్నాయి.
OnePlus 11 5G స్పెషిఫికేషన్లు:
చైనాలో ఇప్పటికే విడుదలైన OnePlus 11.. 6.7-అంగుళాల QHD+ E4 OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. OnePlus HDR 10+ మోడల్ LTPO 3.0కి సపోర్టును అందించింది ఈ ఫోన్. ఇంకా కొంచెం మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను అందించనుంది. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్ కంటెంట్ ఆధారంగా రిఫ్రెష్ రేట్‌ను ఆటోమాటిక్‌గా ఎడ్జిస్ట్ చేయగలదు. OnePlus 10 Pro స్మార్ట్‌ఫోన్‌తో పోల్చితే.. ఇందులో స్టాండర్డ్ పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్, కొద్దిగా వెనుక ప్యానెల్ డిజైన్‌ను చూడవచ్చు. కొత్త వెర్షన్ Qualcomm Snapdragon 8 Gen 2 SoC ద్వారా రన్ అవుతుంది. లేటెస్ట్ UFS 4.0 స్టోరేజ్ వెర్షన్‌తో వచ్చింది. 5,000mAh బ్యాటరీ ఉంది. OnePlus రిటైల్ బాక్స్‌లో 100W ఛార్జర్‌ను అందిస్తుంది. తద్వారా ఇది చాలా మందికి పెద్ద రిలీఫ్ అందిస్తుంది.
ఎందుకంటే Samsung, Apple వంటి కంపెనీలు ఫోన్‌లతో పాటు చార్జర్‌లను షిప్పింగ్ చేయడం లేదు. వైర్‌లెస్ ఛార్జింగ్ లేదా IP68 రేటింగ్‌కు సపోర్టు అందించడం లేదు. శాంసంగ్ Galaxy S21 FEతో ఈ ఫీచర్‌లను అందించలేదు. అందుకే OnePlus బదులుగా IP54 రేటింగ్‌కు సపోర్టును అందించింది. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐకానిక్ అలర్ట్ స్లైడర్‌ను కూడా కలిగి ఉంది. కెమెరాల విషయానికొస్తే.. OnePlus 11 వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెటప్‌లో OIS సపోర్టుతో 50-MP Sony IMX890 సెన్సార్, 48-MP Sony IMX581 అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 32-MP Sony IMX709 2x టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 16-MP కెమెరా కూడా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి