Anant-Radhika: భారత సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వేడుకకు ఏడాది పూర్తి

అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి వేడుక ప్రపంచాన్నే అబ్బురపరిచింది. సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఈ వేడుక కొనసాగింది. దేశంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువులతో పాటు ప్రపంచ దిగ్గజాలు, సినీ, స్పోర్ట్స్ సెలబ్రిటీలు ఈ వేడకకు హాజరయ్యారు. ఈ పెళ్లి సందర్భంగా అంబానీ ఫ్యామిలీ చేపట్టిన సామాజిక కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలిచాయి.

Anant-Radhika: భారత సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వేడుకకు ఏడాది పూర్తి
Anant Radhika Wedding

Updated on: Jul 12, 2025 | 4:54 PM

సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు ఇండియాలో జరిగిన ఓ పెళ్లి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ అతిరథ మహారథులంతా ఆ పెళ్లికి హాజరయ్యారు. కొన్ని రోజుల పాటు జరిగిన పెళ్లి వేడుకలు అందరినీ అబ్బురపరిచాయి. ఆ పెళ్లి మరెవరిదో కాదు ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ – నీతా అంబానీ కొడుకు.. అనంత్ అంబానీ – రాధిక మర్చంట్‌ లది. సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఈ పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి సందర్భంగా వారు ఎన్నో సామాజిక కార్యక్రమాలు సైతం చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు. హిందూ సంప్రదాయంలో వివాహం కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు.. అదొక పవిత్ర బంధం. కలకాలం ఒకరికొకరం తోడుంటామనే నిబద్ధతతో ముడిపడి ఉన్నది.  కానీ నేటి ఆధునిక కాలంలో మన ఆచారాలను మర్చిపోతున్నారు. మరికొంతమంది తూతూమంత్రంగా మమా అనిపిస్తున్నారు. కానీ అంబానీ ఇంట జరిగిన పెళ్లి మాత్రం అలా జరగలేదు అడుగడుగునా సంప్రదాయాలు ఉట్టిపడేలా వివాహ వేడుక నిర్వహించారు. దీన్ని బట్టే అంబానీలు సంప్రదాయాలకు, ఆచారాలకు ఎంత విలువ ఇస్తారో అర్థం చేసుకోవచ్చు.

ఇలాంటి పెళ్లి వేడుకతో భారత్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ పెళ్లి వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక గురువులతో పాటు ప్రపంచ ప్రముఖులు సైతం హాజరయ్యారు. ద్వారకకు చెందిన స్వామి సదానంద సరస్వతి, శంకరాచార్య, జోషిమఠానికి చెందిన స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి, శంకరాచార్య, ఇస్కాన్‌కు చెందిన గౌరంగ్ దాస్ ప్రభు, సాధువు గౌర్ గోపాల్ దాస్, దేవప్రసాద్ మహరాజ్, బాలక్ యోగేశ్వర దాస్, వంటి ఎంతో మంది ధర్మ గురువులు ఈ వేడుకకు హాజరయ్యారు. అంతేకాకుండా ప్రపంచ దిగ్గజ కంపెనీల సీఈఓలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సినీ, స్పోర్ట్స్ ప్రముఖులు, ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

 

ఇక పెళ్లివేడుక సందర్భంగా మానవత్వాన్ని చూపించి ప్రజలకు సేవ చేయడం ప్రశంసనీయం. సేవ చేయాలనే సూత్రాన్ని వారు అక్షరాలా అనుసరించారు. వివాహ సమయంలో నవీ ముంబైలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో 50 పేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. అంతేకాకుండా ప్రతిరోజూ వెయ్యి మందికి భోజనాలు పెట్టారు. వివిధ రకాల వివాహ వేడుకలు చాలా రోజుల పాటు కొనసాగాయి. వచ్చిన అతిథులను అలరించడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. వివాహానికి ఎటువంటి అంతరాయం కలగకుండా వివిధ పూజలు నిర్వహించారు. అంతేకాకుండా వివాహ వేడుకలో భారతీయ దుస్తుల కోడ్‌ను మరచిపోలేదు. దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఈ పెళ్లి వేడుకలో అద్భుతంగా ప్రదర్శించారు. రాధిక మర్చంట్ – అనంత్ అంబానీ వివాహం సంప్రదాయం, ఆధ్యాత్మికత పరంగా ఒక గొప్ప వేడుకగా నిలిచిపోయింది.