AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం కొనుగోలు చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోతారు.. ఎవరూ ఈ విషయాలు చెప్పరు..

పాత బంగారం మార్పిడి చేసేటప్పుడు చాలామంది తెలియని ఖర్చులను భరించాల్సి వస్తుంది. తరుగు, కూలీ ఛార్జీలు, జీఎస్టీ వంటివి కొత్త బంగారానికి అదనంగా పడతాయి.అవసరమైతే తప్ప పాత బంగారాన్ని మార్చుకోవడం వల్ల ఆర్థిక నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎలా అంటే..

Gold: పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం కొనుగోలు చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోతారు.. ఎవరూ ఈ విషయాలు చెప్పరు..
Gold Tips
Venkatrao Lella
|

Updated on: Oct 13, 2026 | 2:05 PM

Share

పండుగల వేళ లేదా ఏదైనా శుభకార్యాలు వచ్చినప్పుడు చాలామంది తమ ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని జ్యువెలరీ షాపులకు తీసుకెళ్లి కొత్త ఆభరణాలు తీసుకుంటారు. ఇలా మార్చుకవవడం వల్ల కొత్త బంగారం తమ చేతికి వస్తుందని భావిస్తుంటారు. కానీ దీని వల్ల జరిగే నష్టాల గురించి చాలామంది ఆలోచించరు. ఇలా పాత బంగారం ఇచ్చి మార్పిడి రూపంలో కొత్త బంగారం తీసుకోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో అదనపు ఖర్చుల గురించి పూర్తి అవగాహన ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతున్న సమయంలో పాత బంగారానికి అదనంగా ఇస్తామంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు చాలా వస్తుంటాయి. ఇలాంటి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది చేద్దాం.

పాత బంగారం మార్చేటప్పుడు షాపు నిర్వాహకులు తరుగు, జీఎస్టీ వంటివి ఉండవని చెప్పి మిమ్మల్ని ట్రాప్‌లో వేస్తుంటారు. అయితే పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం కొనుగోలు చేసేటప్పుడు వ్యాట్, జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్ వంటివి తప్పనిసరిగా వర్తిస్తాయి. వేస్టేజ్ 15 శాతం నుండి 18 శాతం వరకు ఉండవచ్చు. ఇక మేకింగ్ ఛార్జీలు కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద 15 శాతం నుంచి 20 శాతం వరకు అదనపు ఖర్చులు పడతాయి. ఒకవేళ మీరు ఒక తులం పాత బంగారం ఇస్తే.. మళ్లీ ఒక తులం కొత్త బంగారం పొందడానికి అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు ఒక తులం విలువ రూ.1.30 లక్షలు అనుకుంటే.. పాత బంగారానికి ధర లెక్కింపులో ఎలాంటి ఛార్జీలు లేకపోయినా.. కొత్త ఆభరణం కొనుగోలుకు అదనపు ఖర్చులు పడతాయి. పాత బంగారానికి అవుట్‌డేటెడ్ అనే పదం వర్తించదు. బంగారం ఎల్లప్పుడూ ఒక విలువైన ఆస్తిగా, పెట్టుబడిగా పరిగణించబడుతుంది. దీని విలువ కాలంతో పాటు పెరుగుతూనే ఉంటుంది. అవసరమైతే తప్ప పాత బంగారాన్ని మార్చుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.

పాతదైనా, కొత్తదైనా బంగారానికి దాని విలువ ఎప్పుడూ ఉంటుంది. ద్రవ్యోల్బణం దృష్ట్యా.. బ్యాంక్ డిపాజిట్ల కంటే బంగారం మెరుగైన పెట్టుబడి సాధనంగా పనిచేస్తుంది. బ్యాంక్ డిపాజిట్లు 7 నుంచి 8 శాతం వడ్డీని ఇచ్చినా.. ద్రవ్యోల్బణం అదే స్థాయిలో ఉంటే వాస్తవ రాబడి పెద్దగా ఉండదు. పీపీఎఫ్, ప్రావిడెంట్ ఫండ్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ వంటి పథకాల్లో వడ్డీ రేట్లు కాలపరిమితిని బట్టి మారుతుంటాయి. కానీ బంగారంలో పెట్టుబడి పెట్టినప్పుడు, ద్రవ్యోల్బణాన్ని అధిగమించి విలువ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. గృహప్రవేశాలు, పుట్టినరోజు వేడుకలు వంటి ప్రత్యేక సందర్భాల్లో, కొత్త ఆభరణాలు అవసరమైనప్పుడు పాత బంగారాన్ని మార్పిడి చేసుకోవచ్చు. చిన్నతనంలో చేయించిన ఆభరణాలు పెద్దయ్యాక సరిపోనప్పుడు.. వాటిని మార్చుకోవడం ద్వారా కొత్తగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. స్వచ్ఛమైన పెట్టుబడి కోసమైతే, ఆభరణాల కంటే బంగారం నాణేలు లేదా బిస్కెట్లు కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

Follow Us
పాత బంగారం ఇచ్చి కొత్తవి కొనుగోలు చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు..
పాత బంగారం ఇచ్చి కొత్తవి కొనుగోలు చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు..
రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్
రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్
దక్షిణ భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 8 ప్రసిద్ధ దేవాలయాలు..
దక్షిణ భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 8 ప్రసిద్ధ దేవాలయాలు..
డిసెంజర్ 4న రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి.. అతిథుల జాబితా ఇదే?
డిసెంజర్ 4న రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి.. అతిథుల జాబితా ఇదే?
గుడి ప్రసాదం రుచిని తలపించే దద్దోజనం.. ఇలా చేస్తే రోజంతా తాజాగా
గుడి ప్రసాదం రుచిని తలపించే దద్దోజనం.. ఇలా చేస్తే రోజంతా తాజాగా
వాట్సప్‌లో "నో" అనే మెస్సేజ్ వస్తే అలర్ట్.. క్లిక్ చేస్తే అంతే..
వాట్సప్‌లో
దుర్గా నిమజ్జనం రాత్రిపూట ఎందుకు చేయకూడదు? సరైన సమయం, నియమాలు ఇవే
దుర్గా నిమజ్జనం రాత్రిపూట ఎందుకు చేయకూడదు? సరైన సమయం, నియమాలు ఇవే
విడాకులు తీసుకున్న 'అగ్నిసాక్షి' సీరియల్ హీరోయిన్
విడాకులు తీసుకున్న 'అగ్నిసాక్షి' సీరియల్ హీరోయిన్
మెట్ల కింద టాయిలెట్ నిర్మిస్తున్నారా? వాస్తు ప్రకారం ఈ విషయాలు..
మెట్ల కింద టాయిలెట్ నిర్మిస్తున్నారా? వాస్తు ప్రకారం ఈ విషయాలు..
భారత్‌లో 6జీ ఎప్పుడంటే..? అప్పటిలోగా సేవలు..
భారత్‌లో 6జీ ఎప్పుడంటే..? అప్పటిలోగా సేవలు..