Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola Electric: ఔరా ఓలా.. కొత్త ఎలక్ట్రిక్ బైక్ మామూలుగా లేదుగా.. లుక్ చూస్తే స్టన్ అవ్వడం ఖాయం..

దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న విద్యుత్ వాహనాలు కూడా ఓలా స్కూటర్లే. కాగా ఇప్పటి వరకూ స్కూటర్లకే పరిమితమైన ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు బైక్ లను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోంది. ఇప్పటికే పలు మోడళ్ల ను సిద్దం చేసింది. దీనిని వచ్చే మోటోజీపీ భారత్ 2023లో ప్రదర్శించనుంది. ఈ ఓలా బైక్ కొత్త బైక్ డైమండ్ హెడ్, అడ్వెంచర్, క్రూయిజర్, రోడ్ స్టర్ మోడళ్లలో అందుబాటులోకి రానుంది. వీటి లుక్ చూస్తే స్టన్ అయ్యేలా ఉన్నాయి.

Ola Electric: ఔరా ఓలా.. కొత్త ఎలక్ట్రిక్ బైక్ మామూలుగా లేదుగా.. లుక్ చూస్తే స్టన్ అవ్వడం ఖాయం..
Ola Electric Diamondhead Motorcycle
Follow us
Madhu

|

Updated on: Sep 23, 2023 | 2:00 PM

ఓలా ఎలక్ట్రిక్.. మన దేశంలో విద్యుత్ శ్రేణి ద్విచక్ర వాహనాల్లో ఓ ట్రెండ్ సెట్టర్. ముఖ్యంగా స్కూటర్ల విభాగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న విద్యుత్ వాహనాలు కూడా ఓలా స్కూటర్లే. కాగా ఇప్పటి వరకూ స్కూటర్లకే పరిమితమైన ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు బైక్ లను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోంది. ఇప్పటికే పలు మోడళ్ల ను సిద్దం చేసింది. దీనిని వచ్చే మోటోజీపీ భారత్ 2023లో ప్రదర్శించనుంది. ఈ ఓలా బైక్ కొత్త బైక్ డైమండ్ హెడ్, అడ్వెంచర్, క్రూయిజర్, రోడ్ స్టర్ మోడళ్లలో అందుబాటులోకి రానుంది. వీటి లుక్ చూస్తే స్టన్ అయ్యేలా ఉన్నాయి. అత్యాధునిక సాంకేతికతతో, సూపర్ స్మార్ట్ ఫీచర్లతో గ్లోబల్ రేంజ్ డిజైన్ తో ఇవి ఆకర్షించనున్నాయి.  వీటిని కంపెనీకి చెందిన ఫ్యాన్ జోన్లో ఉంచనున్నారు. అన్నీ కుదిరితే 2024 చివరి నాటికి దేశీయ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ విద్యుత్ ద్విచక్ర వాహనాలపై అందరిలోనూ భారీ అంచనాలున్నాయి.

మరోవైపు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మోటోజీపీ భారత్ కి పార్టనర్ గా వ్యవహరిస్తోంది. ఓలా కంపెనీ 150 ఎలక్ట్రిక్ స్కూటర్లను ట్రాక్ చుట్టూ మొబిలీటీ డ్యూటీ కోసం ఉంచారు. ఇవి మార్షల్ మద్దతుతో ఉంచారు.

ఓలా ఎలక్ట్రిక్ సీఎంఓ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ భారతదేశంలో మోటార్ స్పోర్ట్స్ లకు ఇది ఒక ఉత్తేజకరమైన సమయం అన్నారు. మోటో జీపీ వంటి అత్యున్నత తరగతి మోటార్ సైకిల్ రేసింగ్ లు మన దేశంలోకి రావడం శుభపరిణామం అన్నారు. తాము ఈ రంగంలోకి అడుగు పెట్టడమే ఓ గ్లోబల్ స్పోర్ట్స్ ఈవెంట్ ద్వారా రావడం చాలా థ్రిల్లింగ్ ఉందన్నారు. ఓలా విజన్, ఇంజినీరింగ్, సాంకేతికత అన్ని గ్లోబల్ రేంజ్ లో ఉంటాయన్నారు.

ఇవి కూడా చదవండి

ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం మూవ్ ఓఎస్4 బీటా వెర్షన్ ని పరీక్షిస్తోంది. దీన్ని ఎంచుకున్న కస్టమర్లకు కోసం బీటా రోల్ అవుట్ ప్రారంభమైంది. స్టాండర్డ్ వెర్షన్ వినియోగదారులందరికీ వచ్చే నెలలో విడుదల కానుంది. మూవ్ ఓఎస్4తో ఓలా దాని సొంత మ్యాప్ లను జోడిస్తోంది. వీటిని ఓలా మ్యాప్స్ అని నామకరణం చేశారు. రీజనరేషన్, హిల్ హోల్డ్, చార్జింగ్ టైం ప్రిడిక్షన్, చార్జింగ్, రైడింగ్ రేంజ్ వంటి మెరుగైన ఫీచర్లు తమ వద్ద ఉన్నాయని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. హైపర్ చార్జింగ్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని సాయంతో డాక్యూమెంట్ సిన్సింగ్, కాంటాక్ట్ సిస్సింగ్, పైరింగ్, టచ్ రెస్పాన్స్ చాలా వేగంగా జరుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..