Bhavish Aggarwal: ఎలక్ట్రిక్ వెహికిల్స్ కాలిపోతాయట..! ఓలా సీఈవో ట్వీట్.. ఫైర్ అవుతున్న నెటిజనం..

|

Jun 24, 2022 | 6:09 AM

ఇటీవల ఓలా బైక్‌లు వరుసగా తగలబడడంతో ఓలా కంపెనీపై చాలా విమర్శలు వచ్చాయి. దీంతో కంపెనీ ఇమేజ్‌ డ్యామేజైంది. ఈ నేపథ్యంలో ఓలా సీఈవో భవిష్‌ అగర్వాల్‌ చేసిన ట్వీట్‌ వైరల్ అవుతోంది.

Bhavish Aggarwal: ఎలక్ట్రిక్ వెహికిల్స్ కాలిపోతాయట..! ఓలా సీఈవో ట్వీట్.. ఫైర్ అవుతున్న నెటిజనం..
Bhavish Aggarwal
Follow us on

Bhavish Aggarwal on EV Fire: ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనాలంటే.. ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు టెన్షన్‌ పుట్టిస్తున్నాయి. బండి ఎక్కడ తగలబడుతుందో అన్న భయం వాహనదారుల్లో ఉంది. బండి కొన్నాక చార్జింగ్‌ కోసం తిప్పలు ఓవైపు.. ఆ బండి ఎక్కడ మండిపోతుందో అన్న భయం ఇంకో వైపు.. దీంతో ఎలక్ట్రిక్‌ వాహనాలకు గిరాకీ సరిగా ఉండడంలేదు. అయితే EV టూ వీలర్ల కన్నా.. కార్ల సేల్స్‌ మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా టాటా నెక్సాన్‌ ఈవీ ఈ సెగ్మెంట్‌లో కింగ్‌లా కొనసాగుతోంది. నిన్న నెక్సాన్‌ ఈవీ కార్‌ ఒకటి ముంబై రోడ్డుపై కాలిపోయింది. వసయ్‌ వెస్ట్‌లో ఉన్న పంచవతి హోటల్‌ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈవీ కారు తగలబడడం దేశంలోనే తొలిసారి. దీనిపై టాటా కంపెనీ ఎంక్వైరీ ప్రారంభించింది. ఇప్పటివరకు 30వేలకు పైగా టాటా నెక్సాన్‌ ఈవీ కార్లు దేశంలో తిరుగుతున్నాయి. తొలిసారి ఇలాంటి ఘటన జరగడంతో కంపెనీ విచారణ చేస్తోంది.

అయితే.. ఇటీవల ఓలా బైక్‌లు వరుసగా తగలబడడంతో ఓలా కంపెనీపై చాలా విమర్శలు వచ్చాయి. దీంతో కంపెనీ ఇమేజ్‌ డ్యామేజైంది. ఈ నేపథ్యంలో ఓలా సీఈవో భవిష్‌ అగర్వాల్‌ చేసిన ట్వీట్‌ వైరల్ అవుతోంది. నెక్సాన్‌ కార్‌ తగలబడిన ఈవీడియోని రీట్వీట్‌ చేస్తూ.. ఈవీ వాహనాలు కాలిపోవడం సాధారణమే అని పోస్ట్‌ చేశారు. అంతేకాదు.. సాధారణ ఇంధన వాహనాల కన్నా ఈవీ వాహనాలు తగలబడడం ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువన్నారు భవీష్‌. ఆయన టాటానెక్సాన్‌ కారుపైనే స్పందించినా.. తమ కంపెనీ వాహనాలు తగలబడడానికి సమాధానమే ఇది అంటున్నారు విశ్లేషకులు.

ఇవి కూడా చదవండి

అయితే కొందరు కస్టమర్ల సమర్ధిస్తుంటే.. మరికొందరు మాత్రం ఓలా సీఈవో ప్రకటనను వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం మాత్రం ఈవీ వాహనాల ఫైర్‌ ఇన్సిడెంట్లపై ఆగ్రహంతో ఉంది. పర్యావరణాన్ని రక్షించేవిధంగా ఈవీలు ఉండాలి కాని.. ఇలా ప్రజల ప్రాణాలకే ముప్పుతెచ్చేలా కాదని ఇదివరకే కామెంట్స్‌ చేసింది. ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరిగితే ఈవీలను బ్యాన్‌ చేసే దిశగానూ ఆలోచిస్తామని కేంద్రం పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..