ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్లను వచ్చే ఏడాది అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించాలని యోచిస్తోందని సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఓలా వ్యవస్థాపకుడు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ భవిష్ అగర్వాల్ తన ఎలక్ట్రిక్ స్కూటర్లను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించాలనే కంపెనీ ప్రణాళికలను వెల్లడించారు. “ఫ్యాక్టరీ (తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని పోచంపల్లిలో) మేము పెడుతున్న పెట్టుబడి, ఇది ఈ శ్రేణి స్కూటర్ల కోసం మాత్రమే కాదని బైక్‌ల కోసం కూడా అని చెప్పారు. మేము వచ్చే ఏడాది అంతర్జాతీయ మార్కెట్‌లకు వెళ్లనున్నందున ఈ ఫ్యాక్టరీలో వాహనాలు తయరీ పెంచుతున్నామని ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వరుణ్ దూబే మంగళవారం ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీతో సహా యూరప్‌లోని మార్కెట్‌లలో వచ్చే ఏడాది ప్రారంభంలో ఓలా వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తామన్నారు.
డిసెంబర్ మధ్య నాటికి 1,000 కంటే ఎక్కువ నగరాలకు ఎలక్ట్రిక్ స్కూటర్ల కస్టమర్ టెస్ట్ డ్రైవ్‌లను ఇవ్వాలని నిర్ణయించారు. ఇటీవల గ్లోబల్ సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ఆలస్యమైంది. ఇండస్ట్రీ బాడీ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) అంచనాల ప్రకారం వాహనాల టోకు లేదా ఫ్యాక్టరీ పంపకాలు 11% తగ్గాయని తెలుస్తుంది. వార్షిక ప్రాతిపదికన ప్రపంచ చిప్ కొరత ఉత్పత్తిపై భారం పడుతోంది. ప్రపంచంలోని రెండవ-అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌లోకి మరింత చొచ్చుకుపోయేందుకు ఓలా ప్రయత్నిస్తుంది. దేశంలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంచేందుకు ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ నెట్‌వర్క్ ‘ఓలా హైపర్‌చార్జర్ నెట్‌వర్క్’ను ఏర్పాటు చేయడంలో కూడా పెట్టుబడి పెడుతోంది. 400 నగరాల్లో 100,000 ద్విచక్ర వాహనాల ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
Read Also.. Cryptocurrency: క్రిప్టోకరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం.. శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం..!