Ola Scooter: ఓలా స్కూటర్ల తయారీ వీడియోను షేర్‌ చేసిన కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్.. ఆసక్తికర ట్వీట్

|

Oct 27, 2021 | 3:51 PM

Ola Scooter: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు వాహనదారులు..

Ola Scooter: ఓలా స్కూటర్ల తయారీ వీడియోను షేర్‌ చేసిన కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్.. ఆసక్తికర ట్వీట్
Follow us on

Ola Scooter: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు వాహనదారులు. ఇప్పటికే ఓలాతో పాటు ఇతర కంపెనీలు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇక ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ బుధవారం మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో స్కూటర్ల తయారీ విధానాన్ని వీడియో ద్వారా ఆయన షేర్ చేశారు.

ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఉన్న మహిళా కార్మికులు డెలివరీకి ముందు ఓలా ఎస్ 1 స్కూటర్ ఉత్పత్తి ప్రక్రియను వేగంగా చేస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో స్కూటర్ తొలి టెస్ట్ రైడ్లను నవంబర్ 10 నుంచి అందించాలని భావిస్తోంది.

అలాగే నవంబర్‌ 1వ తేదీ నుంచి ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల బుకింగ్స్‌ కూడా కంపెనీ తిరిగి ప్రారంభిస్తోంది. ఓలా సీఈఓ అగర్వాల్ ఇటీవల సంస్థ మొదటి హైప‌ర్ ఛార్జర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓలా ఎలక్ట్రిక్ మొదటి హైపర్ ఛార్జర్ వద్ద ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ వీడియోను ఆయన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఓలా ఎల‌క్ట్రిక్ ఇండియాలోని సుమారు 400 న‌గ‌రాల్లో హైప‌ర్ ఛార్జర్ నెట్ వర్క్ కింద ల‌క్ష ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌ల‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఛార్జింగ్‌ పాయింట్ల వద్ద 18 నిమిషాల ఛార్జింగ్ చేస్తే 75 కిలోమీటర్ల వరకు ప్రయాణించనున్నాయని ఓలా వెల్లడించింది. ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఎస్ 1 ప్రోను ఒక‌సారి ఫుల్ ఛార్జింగ్‌ చేస్తే 181 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది.

 

ఇవి కూడా చదవండి: Jio Fuel Station: రిలయన్స్‌ ఇండస్ట్రీ మరో సంచలనం.. పెట్రోల్‌ బంక్‌ల వ్యాపారంలోకి అడుగు పెట్టిన జియో..!

Biryani Leaf: బిర్యానీ ఆకు సాగుతో లక్షల్లో సంపాదన.. కేవలం 50 మొక్కలతో ఆదాయం ఎంతో తెలిస్తే..