Okinawa: ఒకినావా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌, ఫీచర్స్‌.. ధర వివరాలు..!

|

Mar 13, 2022 | 9:17 PM

Okinawa: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాహనదారులు కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు..

Okinawa: ఒకినావా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌, ఫీచర్స్‌.. ధర వివరాలు..!
Follow us on

Okinawa: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాహనదారులు కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక గురుగ్రామ్‌లోని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒకినావా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ (Electric Scooter)ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే స్కూటర్ అధికారిక పేరు ఇంకా వెల్లడి కాలేదు. కంపెనీ తన రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను Okhi 90 లేదా Oki 90 పేరుతో లాంచ్ చేయగలదని తెలుస్తోంది.

మార్కెట్లోకి విడుదలైన తర్వాత తర్వాత ఓఖీ 90 ధర రూ. 1 లక్ష నుండి రూ. 1.20 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) మధ్య ఉండవచ్చని అంచనా. లాంచ్ చేసిన తర్వాత స్కూటర్ ఓలా ఎస్1, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి ప్రముఖ స్కూటర్లతో పోటీపడుతుంది. Oakhi 90 ప్రోటోటైప్ ఇటీవల పబ్లిక్ రోడ్లపై పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్‌ పొడవాటి సీట్‌ కలిగి ఉంటుంది. అల్లాయ్ వీల్స్, సిల్వర్-ఫినిష్డ్ రియర్ గ్రాబ్ రైల్, డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్‌ను పొందవచ్చు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ స్కూటర్‌కు లిథియం-అయాన్ బ్యాటరీతో అమర్చబడింది. స్కూటర్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్‌ కూడా ఉంటుందని తెలుస్తోంది. బ్యాటరీ, మోటారు స్పెసిఫికేషన్‌ల విషయానికొస్తే.. నివేదికల ప్రకారం.. ఒకినావా నుండి వచ్చిన ఇతర ప్రీమియం మోడల్‌లో దాదాపు 80 kmph వేగంతో, 150 km నుండి 180 km వరకు మైలేజీ ఉంది. స్కూటర్‌లో జియో-ఫెన్సింగ్, నావిగేషన్, డయాగ్నోస్టిక్స్ మొదలైన కనెక్టివిటీ ఫీచర్‌లు కూడా ఉండే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

PAN-Aadhaar: ఈ నెలాఖరులోగా ఈ పని చేయకుంటే పొరపాటు చేసినట్లే.. రూ.10 వేల జరిమానా

Indian Railway: ప్రయాణికుల కోసం ఇండియన్‌ రైల్వే కీలక నిర్ణయం.. ఇక నుంచి మరింత ఆదాయం