ఎలక్ట్రిక్ వాహనాలకు మన దేశంలో మంచి గిరాకీ ఉంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు అందులో కూడా స్కూటర్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలో మార్కెట్లోకి కొత్త కొత్త ఉత్పత్తులు లాంచ్ అవుతున్నాయి. అంతేకాకా ఇప్పటికే ఉన్న స్కూటర్లపై కూడా పలు ఆఫర్లు విడుదల చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే ఒకాయా ఈవీ బ్రాండ్ నుంచి ఓ ఆసక్తికర అప్ డేట్ వచ్చింది. తన బ్రాండ్ నుంచి వచ్చే అన్ని స్కూటర్లపై రూ. 18,000 వరకూ తగ్గింపు ఉంటుందని ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ 2024 ఫిబ్రవరి 24 వరకూ మాత్రమే ఉంటుందని ఒకాయా ప్రకటించింది. ఈ క్రమంలో ఆఫర్లేంటి.. ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న స్కూటర్లేంటి? తెలుసుకుందాం రండి.
ఒకాయా నుంచి పలు రకాల స్కూటర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి ప్రారంభ ధర రూ. 74,899 నుంచి ప్రారంభమవుతాయి. ఇవి సింగిల్ చార్జ్ తో 75 కిలోమీటర్ల పరిధి నుంచి మొదలవుతాయి.
ఒకాయా ఫాస్ట్ ఎఫ్4.. ఈ స్కూటర్ సింగిల్ చార్జ్ పై 140 కిలోమీటర్ల నుంచి 160 కిలోమీటర్ల రేంజ్ ని ఇస్తుంది. దీని ధర రూ. 1,37,990(ఎక్స్ షోరూం) మధ్య ఉంటుంది. ఇది డ్యూయల్ బ్యాటరీ సెటప్ తో వస్తుంది. 4.4కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ వాహన ఇండస్ట్రీలోనే అత్యధిక బ్యాటరీ సామర్థ్యమని ఒకాయా ప్రకటించుకుంది.
ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏఐఎస్ 156 సవరణIII, ఫేజ్ 2 కింద ఐసీఏటీ సర్టిఫికెట్ పొందాయి. ప్రతి రైడ్ బలమైన ఐపీ67 వాటర్ ప్రూఫ్, డస్ట్ రెసిస్టెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ సురక్షితంగా ఉందని నిర్ధారిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..