Electric Scooters: కేవలం రూ.40 వేలకే ఎలక్ట్రిక్‌ వాహనం.. అత్యాధునిక టెక్నాలజీతో తయారీ..!

Electric Scooters: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కస్టమర్లు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలను..

Electric Scooters: కేవలం రూ.40 వేలకే ఎలక్ట్రిక్‌ వాహనం.. అత్యాధునిక టెక్నాలజీతో తయారీ..!
Okaya Electric

Edited By: Anil kumar poka

Updated on: Oct 26, 2021 | 1:08 PM

Electric Scooters: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కస్టమర్లు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కొన్ని ఈవీ వాహనాలు విడుదల కాగా, మరికొన్ని వాహనాలు విడుదల అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక ప్రముఖ ఓకాయా పవర్‌ గ్రూప్‌ ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ కూడా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. తక్కువ ధరకే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను అందిస్తోంది. ఓకాయ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్లో విడుదలైంది. దీని ధర కేవలం రూ.39,999కే లభ్యం కావడం విశేషం. ఈ స్కూటర్‌కు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదా రూ.80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఓకాయా కంపెనీ దేశంలోని 18 రాష్ట్రాల్లో ఇప్పటికే 165 మంది డీలర్లను నియమించుకుంది.

ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ రాష్టంలో ద్విచక్ర వాహనాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసిన సంస్థ హర్యానాలో మరో తయారీ కర్మాగారాన్ని, రాజస్థాన్‌లోని నీమ్రానాలో మరో మూడు ప్లాంట్లను 2023-25 నాటికి ప్రారంభించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్కూటర్‌ అత్యాధునిక టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొంది.

నవరాత్రి పండుగ సందర్భంగా ఈ స్కూటర్‌ను ఇటీవల ప్రారంభించగా, వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తుందని ఓకాయా చెబుతోంది. దీంతో భారత్‌లో పూర్తి స్థాయిలో విస్తరించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపింది. భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా ప్రత్యేకంగా రెండు అత్యాధునిక ఆర్ అండ్ డి సెంటర్లు నెలకొల్పనున్నట్లు సంస్థ తెలిపింది.

ఈ స్కూటర్‌ను నడిపేందుకు ఎటువంటి లైసెన్సు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఓకాయా పవర్ గ్రూప్ 4 దశాబ్దాలుగా భారతదేశంలో బ్యాటరీ తయారీ రంగంలో నమ్మకానికి, నాణ్యతకు మంచి పేరుగా ఉంది. అలాగే దేశంలో బ్యాటరీ తయారీ పరిశ్రమలో అగ్రగామిగా ఉంది. ఈ అనుభవంతోనే ఓకా ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోనికి ప్రవేశించింది.

ఇవి కూడా చదవండి:

Bank Holidays November 2021: కస్టమర్లకు అలర్ట్‌.. నవంబర్‌ నెలలో బ్యాంకులకు 17 రోజులు సెలవులు..!

Gold Price Today: పండగ సీజన్‌లో బంగారం ధరలు పైపైకి.. 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే..