Petrol Adulterated: కల్తీ దందా.. మీ వాహనంలో ఉన్న పెట్రోల్‌ ఒరిజినలేనా? ఇలా సింపుల్‌గా తెలుసుకోండి!

Petrol Adulterated: ఈ రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ల్లో కల్తీ జరుగుతోంది. ఇందు కోసం కొందరు కల్తీ మాఫియాకు పాల్పడుతూ ప్రజలను మోసగిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా పెట్రోల్‌ ట్యాంకులను దారి మళ్లించి గోడౌన్‌లకు తీసుకెళ్లి కల్తీ చేస్తున్నారు..

Petrol Adulterated: కల్తీ దందా.. మీ వాహనంలో ఉన్న పెట్రోల్‌ ఒరిజినలేనా? ఇలా సింపుల్‌గా తెలుసుకోండి!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 30, 2024 | 4:00 PM

Petrol Adulterated: దేశవ్యాప్తంగా కల్తీ దందా కొనసాగుతోంది. కల్తీ జరుగకుండా పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. రకరకాల మార్గాల్లో కల్తీ దందాలను కొనసాగిస్తున్నాయి. ఈ కల్తీమయం వల్ల సామాన్యులు బలైపోతున్నారు. అలాంటి కల్తీ గేమ్ ఒకటి యూపీలో జరుగుతోంది. పెట్రోల్, డీజిల్‌లో ఈ కల్తీ దందా జరుగుతోంది. పెట్రోలు, డీజిల్ కల్తీ దందాలో ఆయిల్ మాఫియా నుంచి ట్యాంకర్ డ్రైవర్ల వరకు పాలుపంచుకుంటున్నారు. ఇందులో కంపెనీ గిడ్డంగుల నుండి చమురు తీయడం ప్రారంభమవుతుంది. దారిలో ట్యాంకర్ల నుంచి అసలైన పెట్రోల్‌, డీజిల్‌ను తీసి కల్తీ చేస్తున్నారు. ఈ కల్తీ దందా కారణంగా మీ వాహనం త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది.

ఆయిల్ డిపో నుండి డీజిల్‌ను తీసుకెళ్లే ట్యాంకర్లు పెట్రోల్ పంప్‌కు సరఫరా చేయడానికి బయలుదేరినప్పుడు ఈ దందా ప్రారంభమవుతుంది. కానీ, మధ్యలోనే ఆయిల్ మాఫియా డ్రైవర్ల అండతో జీపీఎస్‌ను తొలగిస్తుంది. ట్యాంకర్లను తీసుకువెళ్లే వాహనాల్లో జీపీఎస్‌ అమర్చి ఉంటుంది. కానీ ఈ మాఫియా జీపీఎస్‌ను సైతం పని చేయకుండా చేసేస్తున్నారు. ఇలాంటి మాఫియాలు ట్యాంకర్‌లను గోదాములోకి తీసుకెళ్లి పెట్రోల్‌, డీజిల్‌లను కల్తీ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Jio Payment: గుడ్‌న్యూస్‌.. ఇక జియో నుంచి డిజిటల్‌ చెల్లింపులు.. ఆర్బీఐ నుంచి ఆమోదం!

ఇవి కూడా చదవండి

ట్యాంకర్ గోదాము వద్దకు రాగానే అందులో నుంచి 15 శాతం వరకు డీజిల్ బయటకు తీస్తున్నారు. దాని స్థానంలో నకిలీ డీజిల్‌ కలుపుతున్నారు. పనులు పూర్తయిన తర్వాత ట్యాంకర్‌ను తిరిగి అదే మార్గంలో తీసుకెళ్లి జీపీఎస్‌ అమరుస్తుంటారు. ఆ తర్వాత ట్యాంకర్‌ను సరఫరా కోసం పెట్రోల్‌ పంప్‌కు పంపుతారు. వాహనం ఆలస్యంగా రావడం లేదా దారిలో ఆగడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి డ్రైవర్ చాలా చాకచక్యంగా సమాధానం చెబుతూ ట్రాఫిక్ జామ్ అయిందని, అందుకే దారిలో కారు ఆగిందని చెబుతుంటారు.

అనేక కేసులు వెలుగులోకి..

ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో యూపీలో పెట్రోలు, డీజిల్ కల్తీ ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. పర్యవేక్షణ కోసం సాంకేతికత కూడా ఉపయోగిస్తున్నారు. అయితే చమురు మాఫియా దీని చుట్టూ కూడా ఒక మార్గాన్ని కనుగొంటుంది. అక్టోబరు 23న మీరట్‌లో 35 వేల లీటర్ల కల్తీ పెట్రోల్‌, డీజిల్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. 8 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మైదానం మధ్యలో ఉన్న గోదాములో కల్తీకి పాల్పడుతున్న విధానం చూసి అధికారులు సైతం షాకయ్యారు.

ఆ నూనె నిజమో, నకిలీదో మీరే చూసుకోండి

కల్తీ నూనెను నివారించడానికి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు దీన్ని రెండు నిమిషాల్లో సులభంగా తనిఖీ చేయవచ్చు. దీని కోసం ఫిల్టర్ కాగితం లేదా తెలుపు A4 కాగితం అవసరం. ఈ కాగితంపై కొన్ని చుక్కల పెట్రోల్ లేదా డీజిల్ వేయాలి. మీరు పెట్రోల్ పంప్ నుండి కూడా ఇలాంటి కాగితం అడిగి తీసుకోవచ్చు. పెట్రోల్ లేదా డీజిల్ స్వచ్ఛంగా ఉంటే కాగితంపై మరక ఉండదు, ఆరిన తర్వాత పూర్తిగా తెల్లగా ఉంటుంది. ఈ పరీక్ష కేవలం రెండు నిమిషాల్లోనే చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Cancer Drugs: గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న ఈ మూడు క్యాన్సర్ మందుల ధరలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి