Vida EV Scooter: హీరో ఈవీ స్కూటర్‌పై షాకింగ్ ఆఫర్లు.. ఏకంగా రూ.27 వేల తగ్గింపు

తాజాగా హీరో మోటోకార్ప్‌కు సంబంధించిన ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై కంపెనీ ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. ముఖ్యంగా మార్చి 31 లోపు విడా ఈవీ స్కూటర్ కొనుగోలు చేస్తే రూ.27 వేల భారీ తగ్గింపును అందిస్తుంది. అయితే అధునాతన ఫీచర్లతో వచ్చే ఈవీ స్కూటర్‌పై ఆఫర్లను ఎలా పొందాలో? తెలుసుకుందాం. 

Vida EV Scooter: హీరో ఈవీ స్కూటర్‌పై షాకింగ్ ఆఫర్లు.. ఏకంగా రూ.27 వేల తగ్గింపు
Hero Vida V1 Plus

Updated on: Mar 27, 2024 | 8:30 AM

భారతదేశంలో ఈవీ వాహన మార్కెట్ దినదినాభివృద్ధి చెందుతుంది. అన్ని కంపెనీలు సరికొత్త ఆఫర్లను అందిస్తూ ఈవీ వాహనాల కొనుగోలును ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఆర్థిక ముగింపు నేపథ్యంలో ప్రత్యేక ఆఫర్లను ఇస్తున్నాయి. తాజాగా హీరో మోటోకార్ప్‌కు సంబంధించిన ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై కంపెనీ ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. ముఖ్యంగా మార్చి 31 లోపు విడా ఈవీ స్కూటర్ కొనుగోలు చేస్తే రూ.27 వేల భారీ తగ్గింపును అందిస్తుంది. అయితే అధునాతన ఫీచర్లతో వచ్చే ఈవీ స్కూటర్‌పై ఆఫర్లను ఎలా పొందాలో? తెలుసుకుందాం. 

మార్చి నెలలో తమ అమ్మకాలను పెంచుకోవడానికి అనేక ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారులు ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఈ క్రమంలో విడా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై హీరో ఎలక్ట్రిక్ కూడా డిస్కౌంట్లను అందిస్తోంది. మార్చి 2024లో విడా వీ1 లైనప్‌లో రూ. 27 వేల వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని కంపెనీ అందిస్తోంది. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ప్యాకేజీ వాలిడిటీ ఐదేళ్లపాటు ఉంటుంది. ఈ స్కూటర్ మార్చి 31, 2024 లోపు కొనుగోలు చేసినట్లయితే ఐదు సంవత్సరాలు లేదా 50 వేల కిలోమీటర్ల పొడిగించిన బ్యాటరీ వారంటీని, రెండు వేల కంటే ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌లకు యాక్సెస్, ఉచిత సేవ, 24×7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ను అందిస్తుంది. యాప్‌లో కనెక్టివిటీ, సేఫ్టీ ఫీచర్‌లను ఉపయోగించడానికి అనువుగా ఉంటుంది. 

హీరో కంపెనీకు సంబంధించిన విడా ఎలక్ట్రిక్ స్కూటర్ క్రూయిజ్ కంట్రోల్, బూస్ట్ మోడ్, టూ-వే థొరెటల్, కీ-లెస్ యాక్సెస్, ఏడు అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ వంటి అనేక ఫీచర్లతో అందిస్తున్నారు. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఈ స్కూటర్‌ను పూర్తి ఛార్జ్ తర్వాత 110 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్ల వరకు ఉంటుంది. విడా వీ1 ప్లస్ వేరియంట్‌ను హీరో మోటోకార్ప్ నుండి రూ. 97800 ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే విడా వి1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.26 లక్షలుగా ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి