Akshaya Tritiya: ఫోన్ పే వినియోగదారులకు గోల్డెన్ చాన్స్.. రూ. 2వేల వరకూ క్యాష్ బ్యాక్..

|

May 09, 2024 | 6:37 PM

ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ ఫోన్ పే కూడా తమ వినియోగదారులకు అక్షయ తృతీయను పురస్కరించుకుని ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ ప్రకటించింది. మే పదో తేదీన 24కే డిజిటల్ బంగారం కొనుగోలుపై రూ. 2,000 వరకు హామీతో కూడిన క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. ఒకసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కనీసం రూ.వెయ్యితో కొనుగోలు చేయాలి.

Akshaya Tritiya: ఫోన్ పే వినియోగదారులకు గోల్డెన్ చాన్స్.. రూ. 2వేల వరకూ క్యాష్ బ్యాక్..
Phonepe
Follow us on

అక్షయ తృతీయ రోజు బంగారం కొనడాన్ని శుభప్రదంగా ప్రజలు భావిస్తారు. ఆ రోజు తమ శక్తికి తగ్గట్టు ఎంతో కొంత బంగారాన్ని కొనడానికి ప్రయత్నిస్తారు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, తమ కుటుంబం సంతోషంగా ఉంటుందని నమ్మకం. మే నెల 10వ తేదీ శుక్రవారం అక్షయ తృతీయను పురస్కరించుకుని జ్యూయలరీ షాపులు అనేక ఆఫర్లను ప్రకటించాయి. బంగారం, వెండి ఆభరణాల కొనుగోలుపై డిస్కౌంట్, ఇతర ఆఫర్లు అందజేస్తున్నాయి. వీటితో పాటు ఫోన్ పే కూడా తన ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.

బంపర్ ఆఫర్..

ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ ఫోన్ పే కూడా తమ వినియోగదారులకు అక్షయ తృతీయను పురస్కరించుకుని ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ ప్రకటించింది. మే పదో తేదీన 24కే డిజిటల్ బంగారం కొనుగోలుపై రూ. 2,000 వరకు హామీతో కూడిన క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. ఒకసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కనీసం రూ.వెయ్యితో కొనుగోలు చేయాలి. యూపీఐ, యూపీఐ లైట్,క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు, వాలెట్‌లు, గిఫ్ట్ కార్డ్‌లతో సహా వివిధ చెల్లింపు పద్ధతుల ద్వారా అందుబాటులో ఉంటుంది.

ఫోన్ పే ఆఫర్ పొందాలంటే..

  • ముందుగా ఫోన్ పేను తెరిచి, రీఛార్జ్ అండ్ పే బిల్స్ అనే విభాగంలోని సీ ఆల్ లోకి వెళ్లండి.
  • మెనూలో కనిపించిన గోల్డ్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి.
  • బై వన్ టైమ్ ను ఎంచుకోండి.
  • బై ఇన్ రూపీస్ ను ఎంపిక చేసుకుని, 24 క్యారెట్స్ బంగారాన్ని కొనుగోలు చేయడానికి కనీసం రూ.వెయ్యి చెల్లించండి.
  • మీ ఆర్డర్ ను పరిశీలించి, ఆపై ప్రోసీడ్ అండ్ పే పై క్లిక్ చేయండి.
  • మీరు కొనుగోలు చేసిన వెంటనే మీ అప్‌డేట్ చేయబడిన గోల్డ్ బ్యాలెన్స్ ఫోన్ పే యాప్‌లో కనిపిస్తుంది.
  • లావాదేవీ విజయవంతమైన తర్వాత, గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్‌లో క్యాష్‌బ్యాక్ పొందుతారు.

మరింత ప్రయోజనం..

క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో పాటు, క్యారట్‌లేన్ స్టోర్‌లలో ఫోన్‌పే ప్రత్యేక తగ్గింపులను అందిస్తోంది. తమ డిజిటల్ బంగారాన్ని రీడీమ్ చేసుకునే కస్టమర్ల కోసం ఈ ఆఫర్ మే 12 వరకూ అందుబాటులో ఉంది. దీని వల్ల ఖాతాదారులకు కలిగే ప్రయోజనాలు ఇవే..

  • బంగారు నాణేలపై 2% తగ్గింపు
  • స్టడ్ చేయని ఆభరణాలపై 4% తగ్గింపు
  • పొదిగిన నగలపై 10% తగ్గింపు

డిజిటల్ బంగారం అంటే..

అక్షయ తృతీయ సందర్భంగా మే 10వ తేదీన బంగారం కొనడానికి శుభప్రదమని పండితులు చెబుతున్నారు. బంగారు ఆభరణాలు, బంగారు నాణేలు, బంగారు కడ్డీలు వంటి భౌతిక ఎంపికలతో పాటు డిజిటల్ బంగారంలో పెట్టుబడులు కూడా పెట్టుకోవచ్చు. డిజిటల్ బంగారం అనేది ఇటీవల బాగా వ్యాప్తి చెందుతోంది. సాధారణంగా మనం జ్యూయలరీ షాపుల వద్దకు వెళ్లి బంగారం నగలను కొనుగోలు చేస్తాం. వాటిని ఇంటికి తీసుకువచ్చి భద్రపరుస్తాం. లేకపోతే బ్యాంకు లాకర్లలో పెడతాం. అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటాం. అంటే బంగారం అనేది వస్తువుల రూపంలో మన దగ్గర ఉంటుంది.

కనీస పెట్టుబడి..

డిజిటల్ బంగారం అనేది దానికి విరుద్ధంగా ఉంటుంది. ఈ స్కీములలో మనం ఎంతో కొంత పెట్టుబడి పెట్టి బంగారాన్ని కొనుగోలు చేస్తాం. ఆ రోజు ఉన్నబంగారు ధర ప్రకారం ప్రకారం మనం పెట్టుబడికి సరిపడే గోల్డ్ మన పేరుపై జమ అవుతుంది. వాటిలో మనం కనీసం 500 రూపాయలు పెట్టుబడి పెట్టినా దానికి సరిపడే బంగారాన్ని మన పేరు మీద జమ చేస్తారు. భవిష్యత్తులో బంగారం ధర పెరిగినప్పుడు మనం ఆ బంగారాన్ని డిజిటల్ విధానంలోనూ అమ్ముకోవచ్చు. జ్యూయలరీ షాపులలో మనం బంగారం కొనుగోలు చేయాలంటే సుమారు రూ.20 వేలు తీసుకువెళ్లాలి. అదే డిజిటల్ గోల్డ్ లో ఎంత ఉంటే అంత ఇన్వెస్ట్ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..