భారతీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ షురూ అయ్యింది. వీటికి అధిక డిమాండ్ ఏర్పడుతోంది. వేగంగా సంప్రదాయ పెట్రోల్ ఇంజిన్ ద్విచక్ర వాహనాలను ఈ పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాలు రిప్లేస్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు మన దేశంలో ఎక్కడాలేని డిమాండ్ కొనసాగుతోంది. మహిళలతో పాటు పురుషులు కూడా వీటిని కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. వీటి రన్నింగ్, మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ కావడం.. అత్యాధునిక ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉంటుండటంతో అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని టాప్ బ్రాండ్లతో పాటు చిన్న చిన్న స్టార్టప్ లు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు ఒడెస్సీ కూడా రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. వాటి పేర్లు ఒడెస్సీ స్నాప్(SNAP), ఒడెస్సీ ఈ2(E2). వీటిల్లో స్నాప్ హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాగా.. ఈ2 లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. వీటి ధరలను పరిశీలిస్తే ఒడెస్సీ స్నాప్ 79,999(ఎక్స్ షోరూం), ఒడెస్సీ ఈ2 ధర రూ. 69,999(ఎక్స్ షోరూం) ఉంటుంది. ఈ స్కూటర్లను మహారాష్ట్రలోని లోనవాలాలో ఇటీవల జరిగిన ఒడెస్సీ వార్షిక డీలర్షిప్ కాన్ఫరెన్స్ లో ఆవిష్కరించారు. ఇప్పుడు ఈ రెండు స్కూటర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈ కొత్త స్కూటర్ల లాంచ్ సందర్భంగా ఒడిస్సే ఎలక్ట్రిక్ సీఈఓ నెమిన్ వోరా మాట్లాడుతూ కచ్చితత్వం, హై క్వాలిటీతో పాటు కస్టమర్ల సంతృప్తే లక్ష్యంగా తాము స్నాప్ హై-స్పీడ్ స్కూటర్, ఈ2 తక్కువ-స్పీడ్ స్కూటర్లను పరిచయం చేశామన్నారు. ఈ కొత్త ఆఫర్లు భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తాయన్న నమ్మకం తమకు ఉందన్నారు.
స్నాప్‌ను శక్తివంతం చేయడం 2కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. దీని ఫలితంగా గరిష్టంగా 60కేఎంపీహెచ్ వేగంతో స్కూటర్ ప్రయాణించగలుగుతుంది. మోటారు దాని శక్తిని ఏఐఎస్156 సర్టిఫైడ్ స్మార్ట్ బ్యాటరీ (ఎల్ఈపీ) నుంచి పొందుతుంది. ఇది 4 గంటల కంటే తక్కువ చార్జింగ్ సమయంతో ఒకే ఛార్జ్‌పై 105 కిమీ పరిధిని అందిస్తుంది. లక్షణాల పరంగా, స్నాప్ కచ్చితమైన బ్యాటరీ స్థాయి పర్యవేక్షణ కోసం సీఏఎన్ ఎనేబుల్డ్ డిస్ ప్లే ఉంటుంది. అలాగే మెరుగైన సౌలభ్యం కోసం క్రూయిజ్ నియంత్రణను పొందుతుంది. అదే సమయంలో ఈ2 లో స్పీడ్ స్కూటర్ ఫీచర్లను పరిశీలిస్తే.. ఈ2 మరింత నిరాడంబరమైన స్పెక్స్‌ను అందిస్తుంది. ఇది 250వాట్ల ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించగలుగుతుంది. ఈ2 స్కూటర్ కు సంబంధించిన కచ్చితమైన బ్యాటరీ స్పెక్స్‌ను వెల్లడించలేదు కానీ ఇది ఒక్కసారి చార్జ్‌పై 70 కిమీ గరిష్ట పరిధిని, కేవలం 4 గంటల ఛార్జింగ్ సమయాన్ని మాత్రమే అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..