
వంద్ భారత్ స్లీపర్ రైళ్ల కోసం దేశ ప్రజలందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ రైళ్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయోనని కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. ఇవి సాధారణ రైళ్లతో పోలిస్తే వేగంగా వేళ్లడంతో పాటు విమానం తరహాలోనే లగ్జరీ సౌకర్యలు ఉన్నాయి. అలాగే రాత్రిపూట ప్రయాణం చేసే సమయంలో ఎలాంటి సౌండ్స్, కుదుపులు లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. దీంతో ఈ రైళ్లు తమకు కూడా అందుబాటులోకి వస్తే బాగుంటుందని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుతం కేవలం హౌరా-గువహతి మధ్య దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు నడుస్తోంది. త్వరలో మిగతా ప్రాంతాలకు కూడా ఈ రైళ్లను విస్తరించనున్నారు.
ప్రస్తుతం హౌరా-గువహతి మధ్య తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌కు కేవలం 16 కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. కానీ కొత్తగా ఇప్పుడు తయారు చేస్తున్న వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో 24 కోచ్‌లు ఉండనున్నాయి. ఒక్కొ రైలులో 24 కోచ్‌లు ఉండేలా కొత్త వాటిని తయారు చేస్తున్నారు. దీంతో రాబోయే వందే భారత్ స్లీపర్ రైళ్లు 24 కోచ్‌లతో రానుండటంతో మరింత మంది ప్రయాణించడానికి వీలవుతుంది. ప్రస్తుతం ఉన్న 16 కోచ్‌ల రైలులో 823 బెర్త్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ కొత్తగా ప్రారంభించబోయే రైళ్లల్లో కోచ్‌లు ఎక్కువగా ఉండటం వల్ల 1124 బెర్త్‌లు అందుబాటులోకి రానున్నాయి.
కోచ్‌ల సంఖ్య 24కి పెరగనుండటంతో కొత్తగా 401 మంది ప్రయాణికులు అదనంగా ప్రయణించడానికి కుదురుతుంది. 24 కోచ్‌లలో 17 ఏసీ 3 టైర్ కోచ్‌లు ఉండనుండగా.. 5 ఏసీ 2 టైర్, 1 ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ఉంటుంది. ఒకటి ఏసీ ప్యాంట్రీ కార్ కోచ్ ఉంటటుంది. ప్యాంట్రీ కార్ కోచ్ వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. రైల్లో ప్రయాణికులకు అప్పటికప్పుడే వేడి వేడి ఆహారం ప్రెష్‌గా అందించేందుకు ప్యాంట్రీ కోచ్ ఉపయోగపడనుంది. ఇక ప్రతీ బెర్త్‌కు రీడింట్ లైట్, మొబైల్, ల్యాప్ టాప్ ఛార్జింగ్ పాయింట్లు, వ్యాక్యుమ్ అసిస్టెడ్ టాయిలెట్లు ఉండనున్నాయి. ఇక దివ్యాంగులకు ప్రత్యేక వీల్ చైర్ ల్యాప్ ఉండనుంది. ఇక ఈ రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి. ప్రస్తుతం ఉన్న వందే భారత్ స్లీపర్ రైలు కంటే మెరుగైన ఫీచచ్లు కొత్తగా రానున్న రైళ్లల్లో ఉండనున్నాయి. దీంతో రాత్రిపూట ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాాటులోకి రానున్నాయి. కాగా ఈ ఏడాదిలో చాలా రూట్ల మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లు మనం చూడవచ్చు.