మధుమేహం, అధిక రక్తపోటు చికిత్సకు సంబంధించిన మందులతో సహా 74 ఔషధాల రిటైల్ ధరను నిర్ణయించినట్లు ఔషధ ధరల నియంత్రణ సంస్థ NPPA తెలిపింది. ఫిబ్రవరి 21న జరిగిన అథారిటీ 109వ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఆధారంగా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) డ్రగ్స్ ధరల నియంత్రణ ఆర్డర్ 2013 ప్రకారం మందుల ధరలను నిర్ణయించింది.
ఎన్‌పీపీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, ఎన్‌పీపీఏ డపాగ్లిఫ్లోజిన్ సిటాగ్లిప్టిన్, మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ (ఎక్స్‌టెండెడ్-రిలీజ్ టాబ్లెట్) ఒక టాబ్లెట్ ధరను రూ. 27.75గా నిర్ణయించింది.
అదేవిధంగా, డ్రగ్ ప్రైసింగ్ రెగ్యులేటర్ రక్తపోటును తగ్గించే టెల్మిసార్టన్, బిసోప్రోలోల్ ఫ్యూమరేట్ మాత్రల ధరను రూ.10.92గా నిర్ణయించింది. మూర్ఛ, న్యూట్రోపెనియా చికిత్సలో ఉపయోగించే వాటితో సహా 80 నోటిఫైడ్ ఔషధాల (NLEM 2022) సీలింగ్ ధరలను కూడా ఎన్‌పీపీఏ సవరించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి