మన షెడ్యూల్స్ మారుతుంటాయి. ఎప్పుడూ ఒకేలా ఉండవు. ముందు అనుకున్న విధంగా మీరు ఎప్పుడైనా రైలు టికెట్లు బుక్ చేసేసుకుంటే చివరి నిమిషంలో అవి కేన్సిల్ చేయాలంటే ఇబ్బంది. అయితే అటువంటి సందర్భాల్లో మీరు డబ్బలు సేవ్ చేసేందుకు భారతీయ రైల్వే శాఖ ఓ కొత్త స్కీమ్ ను తీసుకొచ్చింది. ఇకపై మీరు రిజర్వేషన్ చేసుకున్న టికెట్లను వేరే ప్రయాణికులకు బదిలీ చేసుకోవచ్చు. దీని వల్ల ఎవరూ నష్టపోవాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ సదుపాయం ప్రయాణికుడి కుటుంబ సభ్యులకు మాత్రమే అవకాశం ఉంటుంది. రైల్వే టికెట్ బదిలీ సేవ పేరుతో దీనిని అమలు చేస్తున్నారు. అంటే మీ ప్రయాణం రద్దయితే మీ స్థానంలో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఆ టికెట్ పై ప్రయాణం చేసే వీలుంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈ సదుపాయాన్ని పొందడానికి, ప్రభుత్వ ఉద్యోగులతో సహా ప్రయాణికులు రైలు బయలుదేరే సమయానికి 24 గంటల ముందు అదే అభ్యర్థనను నమోదు చేయవలసి ఉంటుంది. ఐఆర్సీటీసీ పోర్టల్‌లో అభ్యర్థన చేసిన తర్వాత, టికెట్ కొత్త ప్రయాణికుడికి బదిలీ అవుతుంది. ఒకవేళ, ప్రయాణికుడు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి, పండుగ, వివాహ సందర్భం లేదా ఏదైనా వ్యక్తిగత సమస్య ఉన్నట్లయితే, వారు బయలుదేరే సమయానికి 48 గంటల ముందు టికెట్ బదిలీ అభ్యర్థనను చేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ఎన్సీసీ అభ్యర్థులు కూడా టికెట్ బదిలీ సేవ ప్రయోజనాలను పొందవచ్చు. వ్యక్తిని భర్తీ చేసే రైలు ప్రయాణికులు ధ్రువీకరణ కోసం ప్రయాణ సమయంలో చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ ఐడీని కలిగి ఉండాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..