UPI Payments: డిజిటల్‌ పేమెంట్స్‌ చేసేవారికి శుభవార్త.. ఇకపై డెబిట్‌ కార్డు లేకపోయినా యూపీఐ సేవలు..

|

Mar 12, 2022 | 7:06 AM

UPI Payments: దేశంలో డిజిటల్ పేమెంట్స్‌ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. డిజిటల్ పేమెంట్స్‌ (Digital Payments) సంస్థలు సైతం పలు రకాల ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తుండడంతో యూపీఐ పేమెంట్స్ (UPI Payments) భారీగా పెరుగుతున్నాయి..

UPI Payments: డిజిటల్‌ పేమెంట్స్‌ చేసేవారికి శుభవార్త.. ఇకపై డెబిట్‌ కార్డు లేకపోయినా యూపీఐ సేవలు..
Upi Payments
Follow us on

UPI Payments: దేశంలో డిజిటల్ పేమెంట్స్‌ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. డిజిటల్ పేమెంట్స్‌ (Digital Payments) సంస్థలు సైతం పలు రకాల ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తుండడంతో యూపీఐ పేమెంట్స్ (UPI Payments) భారీగా పెరుగుతున్నాయి. చిన్న టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద దుకాణాల వరకు డిజిటల్‌ పేమెంట్స్‌కు పెద్ద పీఠ వేస్తుండడం కూడా దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే యూపీఐ పేమెంట్స్‌ కోసం రిజిస్టర్‌ చేసుకోవాలంటే వినియోగదారుడికి కచ్చితంగా డెబిట్ కార్డు ఉండాలి. ఈ కారణంగా కొంతమంది డిజిటల్ పేమెంట్‌ సేవలను పొందలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కొందరు డిజిటల్‌ పేమెంట్స్‌ చేసే అవగాహన ఉన్నా డెబిట్‌ కార్డు లేక సేవలను పొంద లేకపోతున్నారు.

దీంతో ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) ఒక వెసులుబాటును కల్పించింది. డెబిట్‌ కార్డు లేకున్నా యూపీఐ సేవలను పొందే అవకాశాన్ని వినియోగదారులకు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఎన్‌పీసీఐ ఇప్పటికే బ్యాంకులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. దేశంలో డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆధార్ నెంబర్, ఓటీపీ ద్వారా డెబిట్ కార్డు లేని బ్యాంకు ఖాతాదారులకు యుపీఐ సేవలను అందించాలని బ్యాంకులను కోరింది.

ఆధార్ నెంబర్, ఓటీపీ ద్వారా డెబిట్ కార్డు లేని/ డెబిట్ కార్డు పనిచేయని వినియోగదారులకు యుపీఐ సేవలను అందజేయవచ్చు అని తెలిపింది. ఈ విషయమై ఎన్‌పీసీఐ గతేడాది సెప్టెంబర్‌ నెలలోనే సర్క్యులర్ జారీ చేసింది. ఇదిలా ఉంటే ఖాతాదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే బ్యాంకులో ఇచ్చిన మొబైల్ నెంబర్, ఆధార్ కార్డుకి లింకు చేసిన మొబైల్ నెంబర్ ఒకటే అయి ఉండాలి.

Also Read: Psychological Stress: మానసిక ఒత్తిడి నుంచి బయటపడటం ఎలా..? సింపుల్‌ చిట్కాలు..!

Ram Gopal Varma: నాకూ ఫీలింగ్స్‌ ఉంటాయి.. నేను బాధపడతా అంటున్న రాంగోపాల్ వర్మ.. వీడియో

Viral Video: యజమాని కోసం ఇంజనీర్‌గా మారిన కుక్క.. వైరల్ అవుతున్న అద్భుతమైన వీడియో..!