EPFO: ఆధార్‌ లేకుండానే ఈపీఎఫ్‌ క్లెయిమ్‌… వారికి మాత్రమే

|

Dec 01, 2024 | 2:16 PM

ఉద్యోగుల భవిష్యత్తు నిధి సంస్థ ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పీఎఫ్‌ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే క్రమంలో ఆధార్‌ కార్డ్‌ లింక్‌ చేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. అయితే ఈ వెసులుబాటు అందరికీ కాదని కేవలం కొందరికి మాత్రమే అని తెలిపారు..

EPFO: ఆధార్‌ లేకుండానే ఈపీఎఫ్‌ క్లెయిమ్‌... వారికి మాత్రమే
Epfo
Follow us on

ఈపీఎఫ్‌ క్లెయిమ్‌ చేసుకోవాలంటే కొన్ని రకాల నిబంధనలు ఫాలో కావాలనే విషయం తెలిసిందే. వీటిలో ఆధార్‌ లింక్‌ ఒకటి. ఇందుకోసం ఉద్యోగులు కచ్చితంగా యూఎన్‌ఎన్‌ నెంబర్‌కు ఆధార్‌ను లింక్‌ చేయాల్సి ఉంటుంది. అయితే తాజాగా ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొంతమంది ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెబుతూ.. ఫిజికల్ క్లెయిమ్‌లను సెటిల్ చేయడానికి ఇకపై తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)తో ఆధార్‌ను లింక్ చేయాల్సిన అవసరం లేదని ఈపీఎఫ్‌ఓ ప్రకటించింది.

కొత్తగా సవరించిన విధానంలో భాగంగా ఈ మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మినహాయింపు అందరు ఉద్యోగులకు వర్తించదు. కొంతమంది ఉద్యోగులకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని తెఇలపారు. భారతదేశంలో తమ అసైన్‌మెంట్ పూర్తి చేసి, ఆధార్ పొందకుండా స్వదేశానికి తిరిగి వెళ్లిన అంతర్జాతీయ వర్కర్లు, విదేశాలకు వలస వెళ్లి, అక్కడి పౌరసత్వం పొందిన ఆధార్ లేని భారతీయులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది.

ఆధార్‌ కార్డు లేకుండా నేపాలీ, భూటాన్‌ పౌరులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని చెబుతున్నారు. ఈ ఉద్యోగులు ఆధార్‌కు బదులుగా పాస్‌పోర్ట్‌లు లేదా వారి పౌరసత్వ గుర్తింపు వంటి సర్టిఫికెట్స్‌ను అల్టర్‌నెటివ్‌గా ఉపయోగించుకోవచ్చు. ‘డ్యూ డిలిజెన్స్’ ప్రక్రియలో భాగంగా, మినహాయింపులు క్లెయిమ్ చేస్తున్న ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేయాలని, పీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్ రూ. 5 లక్షలకు మించి ఉంటే సంబంధిత యాజమాన్యాలతో వివరాలను ధ్రువీకరించాలని ఈపీఎఫ్‌వో అధికారులకు సూచించింది. సెటిల్‌మెంట్‌ సొమ్మును నెఫ్ట్‌ ద్వారానే బదిలీ చేయనున్నట్లు పేర్కొంది.

ఇదిలా ఉంటే ఈపీఎఫ్‌ఓ వచ్చే ఏడాది కీలక మార్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపై పీఎఫ్‌ ఖాతాదారులు క్లెయిమ్‌ చేసుకున్న మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే విధానాన్ని మరింత సులభతరం చేయనుంది. ఏటీఎమ్‌ నుంచి పీఎఫ్‌ సొమమును విత్‌డ్రా చేసుకునే విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..