మీ పేదరికానికి తక్కువ జీతం కారణం కాదు..! అసలు సమస్య ఇక్కడే ఉంది! దాన్ని మార్చుకుంటే ధనవంతులే..

తాము పేద, మధ్య తరగతి వారిగా ఉండేందుకు కారణం తమకు వస్తున్న తక్కువ జీతం అని కూడా అనుకోవచ్చు, కానీ అసలు సమస్య అది కాదు. వచ్చిన జీతంలో సరైన పొదుపు చేయకుండా, లైఫ్‌స్టైల్‌కు ఎక్కువ ఖర్చు చేయడమే. ఇప్పుడు రూ.50 వేల జీతం వస్తుంటే అందులో కొంత మొత్తం పొదుపు చేయకుండా..

మీ పేదరికానికి తక్కువ జీతం కారణం కాదు..! అసలు సమస్య ఇక్కడే ఉంది! దాన్ని మార్చుకుంటే ధనవంతులే..
Gratuity

Updated on: Dec 01, 2025 | 11:37 PM

ఎక్కువ జీతం వచ్చిన తర్వాత పొదుపు చేద్దాం అని చాలా మంది అనుకుంటారని, కానీ అదో పెద్ద అపోహ అంటూ జాక్టర్ మనీ సహ వ్యవస్థాపకుడు CA అభిషేక్ వాలియా తేల్చిపారేశారు. పొదుపు అంటే మీరు ఎంత సంపాదిస్తారనేది కాదు, మీరు ఇప్పటికే ఉన్న సంపాదనలో ఎంత పొదుపు చేస్తారనే విషయం అని ఆయన అన్నారు. ఆదాయ వృద్ధి మాత్రమే పొదుపు కారణం కాదని, రూ.50,000 జీతం ఉన్నప్పుడు పొదుపు చేయలేని వారు, నెలకు రూ.1,50,000 సంపాదించన సమయంలో పొదుపు చేస్తారని గ్యారెంటీ లేదని తెలిపారు.

అయితే చాలా మంది తాము పేద, మధ్య తరగతి వారిగా ఉండేందుకు కారణం తమకు వస్తున్న తక్కువ జీతం అని కూడా అనుకోవచ్చు, కానీ అసలు సమస్య అది కాదు. వచ్చిన జీతంలో సరైన పొదుపు చేయకుండా, లైఫ్‌స్టైల్‌కు ఎక్కువ ఖర్చు చేయడమే. ఇప్పుడు రూ.50 వేల జీతం వస్తుంటే అందులో కొంత మొత్తం పొదుపు చేయకుండా.. జీతం పెరిగిన తర్వాత పొదుపు చేద్దాం అని అనుకొని.. తీరా జీతం పెరిగాక పొదుపు చేయకుండా పెరిగి జీతాన్ని లైఫ్‌ స్టైల్‌ స్టాండెడ్‌ పెంచేందుకే వాడుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆఫీస్‌కి బైక్‌పై వెళ్లే వారు జీతం పెరగ్గానే బైక్‌ పక్కన పెట్టి కారు కొంటున్నారు. ఆ పెరిగిన జీతం కారు ఈఎంఐకి సరిపోతుంది. ఇలానే చాలా మంది ధనవంతులు కాలేకపోతున్నారు. బైక్‌ నుంచి కారుకు మారినంత మాత్రనా వారు ధనవంతులు అయినట్లు కాదు. నిజానికి అప్పుల్లోకి వెళ్లినట్లు అని వాలియా అన్నారు.

చాలామంది ఫోన్లు, సెలవులు, ఫర్నిచర్ లేదా అద్దెను కూడా అప్‌గ్రేడ్ చేసుకుంటారు. ప్రతి అప్‌గ్రేడ్ పొదుపులను జాబితాలో మరింత క్రిందికి నెట్టివేస్తుంది. జీవనశైలి ఖర్చులలో ఈ నెమ్మదిగా పెరుగుదల చాలా మందిని సంవత్సరాల తరబడి ఒకే ఆర్థిక స్థాయిలో ఇరుక్కుపోయేలా చేస్తుంది. దీనికి విరుద్ధంగా కేవలం సరైన సమయం లేదా మంచి ఆదాయం కోసం వేచి ఉండటం ద్వారా సంపద పెరగదు. నేడు ప్రజలు తమ డబ్బును నియంత్రించాలని నిర్ణయించుకున్నప్పుడు అది పెరుగుతుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి